మెరిసిన సల్మాన్, రవూఫ్‌  | Agha, Rauf shine as Pakistan beat Afghanistan in T20 tri-series | Sakshi
Sakshi News home page

మెరిసిన సల్మాన్, రవూఫ్‌ 

Aug 31 2025 6:28 AM | Updated on Aug 31 2025 6:28 AM

Agha, Rauf shine as Pakistan beat Afghanistan in T20 tri-series

అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్‌ విజయం 

ముక్కోణపు టి20 టోర్నమెంట్‌ 

షార్జా: ఆసియాకప్‌ టి20 టోర్నమెంట్‌ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ) పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 39 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెపె్టన్‌ సల్మాన్‌ ఆగా (36 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఫఖర్‌ జమాన్‌ (20; 1 ఫోర్, 1 సిక్స్‌), మొహమ్మద్‌ నవాజ్‌ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరీద్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టగా... రషీద్‌ ఖాన్, మొహమ్మద్‌ నబీ, అజ్మతుల్లా, ముజీబ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్‌ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. 

కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (16 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... రహా్మనుల్లా గుర్బాజ్‌ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్తా పోరాడాడు. మొహమ్మద్‌ నబీ (3), అజ్మతుల్లా (0), కరీమ్‌ జనత్‌ (0), ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (9) విఫలమవడంతో అఫ్గాన్‌కు పరాజయం తప్పలేదు. ఒక దశలో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును రషీద్‌ ఆదుకున్నాడు. ఎడాపెడా సిక్స్‌లు బాదుతూ ప్రత్యర్థిని భయపెట్టాడు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ 4 వికెట్లు పడగొట్టగా... షాహీన్‌ షా అఫ్రిది, మొహమ్మద్‌ నవాజ్, ముఖీమ్‌ తలా రెండు వికెట్లు తీశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement