ఇమ్రాన్‌ సజీవంగా ఉన్నట్లు సాక్ష్యం చూపండి | Imran Khan son demands govt to present proof that jailed former Pak PM is alive | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ సజీవంగా ఉన్నట్లు సాక్ష్యం చూపండి

Nov 30 2025 4:37 AM | Updated on Nov 30 2025 4:39 AM

Imran Khan son demands govt to present proof that jailed former Pak PM is alive

పాక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన మాజీ ప్రధాని కుమారుడు

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకి స్తాన్‌ తెహ్రీక్‌ ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ) వ్యవ స్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌(73) అడియా లా జైలులో సజీవంగానే ఉన్నట్లు చెబు తున్న ప్రభుత్వం, అందుకు తగిన సాక్ష్యా లను చూపాలని ఆయన కుమారుడు కాసిమ్‌ ఖాన్‌ డిమాండ్‌ చేశారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ రెండేళ్లుగా జైలులోనే ఉన్నారు. 

దాదాపు నెల రోజులుగా ఆయన్ను కలుసుకునేందుకు కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో పాటు లాయర్లకు సైతం జైలు అధికా రులు అనుమతివ్వడం లేదు. దీంతో, ఇమ్రాన్‌ ఖాన్‌ చనిపోయినట్లుగా జరు గుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం కాసిమ్‌ ఖాన్‌ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘మా తండ్రిని 845 రోజులుగా జైలులో ఉంచారు. ఆరు వారాలుగా ఆయనతో ఎవరినీ కలవనివ్వకుండా ఒంటరిగా ఉంచారు. ఆయన ఆరోగ్యం గురించి తెలియనివ్వడం లేదు. 

కోర్టు ఉత్తర్వులున్నా, ఆయన సోదరీమణు లను లోపలికి వెళ్లనివ్వడం లేదు. కనీసం ఫోన్‌ కాల్‌కూ అవకాశమివ్వడం లేదు. దీంతో, ఆయన పరిస్థితిపై అనుమానా లు కలుగుతున్నాయి. ఇమ్రాన్‌ సజీవంగా ఉన్నట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు తగిన సాక్ష్యాలను చూపాలి’అని అందులో పేర్కొన్నారు. ‘ఆయన భద్రత బాధ్యత పూర్తిగా పాక్‌ ప్రభుత్వంలోని పెద్దలదే. చట్టపరంగా, నైతికంగా, అంతర్జాతీయంగా కూడా వారే బాధ్యత వహించాలి’అని స్పష్టం చేశారు. 

ఇమ్రాన్‌ బరువు బాగా తగ్గిపోయారు. దృష్టి సమస్యలు, విషప్రయోగం జరిగే అవ కాశం ఉందంటూ వస్తున్న వార్తలను కాసిమ్‌ ఖాన్‌ ప్రస్తావించారు. ఇమ్రాన్‌ ముగ్గురు సోదరీమణులు, పీటీఐ కార్యకర్తలు ఖైబర్‌ ప్రావిన్స్‌ సీఎం సొహైల్‌ అఫ్రిది సహా అడియాలా జైలు వెలుపలే కొద్ది రోజులుగా మకాం వేశారు. ఇమ్రాన్‌ను కలుసుకునేందుకు కుటుంబసభ్యులకు అనుమతివ్వాలని పీఎం షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌ అడియాలా జైలు సూపరింటెండెంట్‌పై ఇస్లామాబాద్‌ హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement