
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. టాస్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.
సాధారణంగా ఏ మ్యాచ్‌కైనా టాస్ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్‌తో ఒకరు, భారత కెప్టెన్‌తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో భారత్‌కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో అదే దేశానికి చెందిన వకార్ యూనిస్ సంభాషించాడు.
టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ కెప్టెన్‌తో హ్యాండ్ షేక్‌కు దూరంగా ఉన్నాడు. టాస్ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తున్న టీమిండియా సాధారణంగా బౌలింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. అతను 2 ఓవర్లలో 12 పరుగులకే ఇచ్చి పర్వాలేదనిపించాడు. బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో ఓవర్ వేశారు.
6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 45/0గా ఉంది. ఫర్హాన్ 31, ఫకర్ జమాన్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ మ్యాచ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు