
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సల్మాన్ అలీ విఫలమయ్యాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన సల్మాన్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్‌తో మ్యాచ్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు.
కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొలి బంతి నుంచే భారత స్పిన్నర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆఖరికి 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసిన సల్మాన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడి వికెట్ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.
దీంతో కెప్టెన్‌గా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న అలీ అఘాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
SALMAN ALI AGHA IN T20Is
4(2) – 0(1) – 1(9) – 13(19) – 32(32)
5 innings, 50 runs, 10 avg, 79 SR. pic.twitter.com/6rgh4P6ZlA— junaiz (@dhillow_) March 4, 2025
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.