నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.
భారత ఇన్నింగ్స్‌కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు.
వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్‌దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్‌ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది.
ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను రేపు (నవంబర్ 18) ఒమన్‌తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.
మాటలోనూ చిచ్చరపిడుగే..!
14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు.
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఉబైద్ షా వైభవ్‌వైపు సీరియస్‌గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్‌కు తన దమ్మును చూపాడు.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే


