breaking news
ACC Mens Asia Cup Rising Stars 2025
-
శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులు.. భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం అందుకుంది. దోహా వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా 148 పరుగుల తేడాతో చిత్తు చేసి జయభేరి మోగించింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భాగంగా వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్- యూఏఈ (IND A vs UAE) జట్లు శుక్రవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 297 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులుఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) భారీ, విధ్వంసకర శతకం (42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు- 144)తో విరుచుకుపడగా.. జితేశ్ శర్మ (Jitesh Sharma) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగిలిన వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (23 బంతుల్లో 34) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (10) రనౌట్ కాగా.. నేహాల్ వధేరా (14) నిరాశపరిచాడు. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 6) జితేశ్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కుప్పకూలిన టాపార్డర్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు మయాంక్ రాజేశ్ కుమార్ (18), కెప్టెన్ అలిషాన్ షరాఫు (3) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ అహ్మద్ తారిక్ డకౌట్ అయ్యాడు.సొహైబ్ మెరుపు అర్ధ శతకం వృథాఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ సొహైబ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (41 బంతుల్లో 63) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సొహైబ్ మెరుపులకు తెరపడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లలో హర్షిత్ కౌశిక్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సయీద్ హైదర్ (20), ముహమ్మద్ అర్ఫాన్ (26) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అయాన్ ఖాన్ 2, ముహమ్మద్ ఫరాజుద్దీన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేసిన యూఏఈ.. భారత్-‘ఎ’ జట్టు చేతిలో భారీ ఓటమి చవిచూసింది. 148 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లుభారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్‌కు మూడు వికెట్ల తో సత్తా చాటగా.. హర్ష్ దూబే రెండు, రమణ్‌దీప్ సింగ్ , యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం నాటి తదుపరి మ్యాచ్‌లో భారత్- పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు.ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ శుక్రవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ఈవెంట్లో భారత్-‘ఎ’ జట్టు.. యూఏఈతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది.వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్భారత ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య (10) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం.Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥📹 | A statement century from our Boss Baby to set the tone 🤩 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 అయితే, యూఏఈ బౌలర్ ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి పొట్టి ఫార్మాట్లో ఇది రెండో శతకం. అంతేకాదు రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా! ఈ క్రమంలోనే పద్నాలుగేళ్ల ఈ బిహారీ పిల్లాడు సరికొత్త చరిత్ర లిఖించాడు.Naye India ka Naya Superstar. 💙 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/Ht7z25zMVs— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డుకాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన విషయం తెలిసిందే. అప్పుడు అతడి వయసు పద్నాలుగేళ్ల 32 రోజులు మాత్రమే. ఇక తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భాగంగా వైభవ్ 32 బంతుల్లోనే శతక్కొట్టి తన రికార్డును తానే సవరించాడు.పద్నాలుగేళ్ల 232 రోజుల వయసులో తన రెండో టీ20 సెంచరీ చేసిన వైభవ్.. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు.. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రిషభ్ పంత్ రికార్డు సవరించాడు.టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు వీరే🏏ఉర్విల్ పటేల్- 2024లో గుజరాత్ తరఫున త్రిపురతో మ్యాచ్‌లో 28 బంతుల్లో🏏అభిషేక్ శర్మ- 2024లో పంజాబ్ తరఫున మేఘాలయపై 28 బంతుల్లో🏏రిషభ్ పంత్- 2018లో ఢిల్లీ తరఫున హిమాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో🏏వైభవ్ సూర్యవంశీ- 2025లో భారత్ తరఫున యూఏఈపై 32 బంతుల్లో శతకంభారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. యూఏఈతో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (144)తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ కూడా అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో నమన్ ధీర్ (34) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 297 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ అఫ్జల్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌దే పైచేయి! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి..
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ఆసియా క్రికెట్ మండలి (ACC) పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.కేవలం పదహారు బంతుల్లోనేఈ క్రమంలో మరో ఓపెనర్, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్‌తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.Vaibhav Sooryavanshi is putting on a fireworks show 🎇 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/1gNEz5UwHb— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్ శతక ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. Welcome to the Boss Baby’s world 🥵Vaibhav Sooryavanshi clears the boundary like it’s nothing 🤌 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/8Qha1Edzab— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 202510 ఓవర్లలోనేవైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు.. నమన్ ధీర్ కూడా మెరుపులు (21 బంతుల్లో 33) మెరిపించడంతో 10 ఓవర్లలోనే భారత్ కేవలం వికెట్ నష్టపోయి 149 పరుగులు చేయడం మరో విశేషం. ఇక 12వ ఓవర్ తొలి బంతికి ముహమ్మద్ ఆర్ఫాన్ బౌలింగ్‌లో ముహమ్మద్ రోహిద్ ఖాన్‌కు నమన్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కాగా వైభవ్, నమన్ రెండో వికెట్‌కు 57 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. నమన్ స్థానంలో కెప్టెన్ జితేశ్ శర్మ నాలుగో నంబర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరకాగా 12.3 ఓవర్లో ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించి.. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద నిలిచింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
‘పసికూన’పై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
ఆసియా క్రికెట్ మండలి నిర్వహిస్తున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2025 ( Asia Cup Rising Stars) టోర్నమెంట్ శుక్రవారం మొదలైంది. దోహా వేదికగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్- ‘ఎ’- ఒమన్ జట్లు తలపడ్డాయి. వెస్ట్ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ చేసింది.పరుగుల విధ్వంసంఈ క్రమంలో ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (6) వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మరో ఓపెనర్ మాజ్ సదాకత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి 96 పరుగులు చేసిన సదాకత్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మిగతా వాళ్లలో యాసిర్ ఖాన్ (26 బంతుల్లో 26), మొహ్మద్ ఫైక్ (9 బంతుల్లో 19) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ 21 బంతుల్లోనే 44 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో సాద్ మసూద్ మెరుపులు (6 బంతుల్లో 19 నాటౌట్) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్-ఎ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు సాధించింది.ఆది నుంచే కష్టాలుఒమన్ బౌలర్లలో షఫీక్ జాన్, ముజాహిర్ రజా, జే ఒడేడ్రా, వసీం అలీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సూఫియాన్ యూసఫ్ (3) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ హమ్మద్ మీర్జా (27 బంతుల్లో 34) రనౌట్ అయి వికెట్ పారేసుకున్నాడు.వన్‌డౌన్‌లో వచ్చిన కరణ్ సోనావాలే (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్లో వసీం అలీ (5), నారాయణ్ సాయిశివ్ (1), ఆర్యన్ బిస్త్ (2) పూర్తిగా నిరాశపరిచారు. జై ఒడేడ్రా డకౌట్ అయ్యాడు.ఘాఆఖర్లో మెరుపులు..ఇలాంటి దశలో జిక్రియా ఇస్లాం, ముజాహిర్ రజా ధనాధన్ దంచికొట్టి జట్టు విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిక్రియా ఇస్లాం మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు- 57 పరుగులు) సాధించగా.. రజా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించలేదు.బోణీ కొట్టిన పాక్ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. ఒమన్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పాకిస్తాన్ ఒమన్‌పై 40 పరుగుల తేడాతో గెలిచింది. విజయంతో ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింట్ స్టార్స్ టీ20 టోర్నీని ఆరంభించింది. మాజ్ సదాకత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే


