ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. యూఏఈ-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(42 బంతుల్లో 144 పరుగులు)తో చెలరేగిన వైభవ్.. ఆ తర్వాత పాక్‌పై కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు 14 ఏళ్ల వైభవ్.. 189 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేటు ఏకంగా 270.00 ఉండడం గమనార్హం. ఇక మంగళవారం ఒమన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌లో కూడా సత్తాచాటాలని సూర్యవంశీ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వైభవ్ బ్యాటింగ్‌కు అభిమానులే కాదు ఒమన్ ఓపెనింగ్ బ్యాటర్ ఆర్యన్ బిష్ట్ సైతం పిధా అయిపోయాడు. వైభవ్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడని తను ఇప్పటివరకు చూడలేదని అతడు కొనియాడాడు.
"గతంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను టీవీలో చూశాం. ఇప్పుడు మేము అతడికి ప్రత్యర్ధిగా ఆడబోతున్నాం. . సూర్యవంశీని కలిసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చకునే ప్రయత్నం చేస్తాను. కేవలం 14 ఏళ్ల వయస్సులో అంతటి భారీ సిక్స్‌లు కొట్టడం నిజంగా గ్రేట్. వైభవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది.
అతడు కచ్చితంగా త్వరలో సీనియర్ జట్టుకు ఆడుతాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు దూకుడుకు కళ్లేం వేసేందుకు ప్రయత్నిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఇప్పటికే గ్రూపు-బి నుంచి పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్.. గంభీర్ చర్య వైరల్


