టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో 13 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు ఓటమి రుచిని చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టును ఓడించడంలో సఫారీ బౌలర్లు ఎంత కీలక పాత్ర పోషించారో.. బవుమా ఆడిన ఇన్నింగ్స్ కూడా అంతే విలువైనది.
బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌పై బవుమా.. బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడతున్నప్పటికి బవుమా మాత్రం తన ఏకాగ్రాతను కోల్పోకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్ అంటే బవుమాలా ఉండాలని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆఖరికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బవుమా ఆడిన ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు.
కెప్టెన్సీ రికార్డు అదుర్స్..
2021 మార్చిలో క్వింటన్ డికాక్ నుంచి సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బవుమమా బాధ్యతలు స్వీకరించాడు. తద్వారా దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమితులైన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాడిగా టెంబా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2022లో ప్రోటీస్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా బవుమా పర్వాలేదన్పించినప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అతడి కెప్టెన్సీలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గెలుచుకున్న తొలి ఐసీసీ ట్రోఫీ
వరల్డ్ రికార్డు..
టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 10 విజయాలు, ఒక్క డ్రా ఉంది. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 11 టెస్టుల్లో పది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా టెంబా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ


