మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (నవంబర్ 11) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా (87 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
ఆల్‌రౌండర్ హుస్సేన్ తలాత్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఫకర్ జమాన్ (32), మొహమ్మద్ నవాజ్ (36 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (29) మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సైమ్ అయూబ్ (6), మొహమ్మద్ రిజ్వాన్ (5) నిరాశపరిచారు.
శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ (10-0-54-3), అషిత ఫెర్నాండో (10-2-42-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తీక్షణ ఓ వికెట్ తీశాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
బాబర్ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో అతను సెంచరీ చేసి ఏకంగా 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్‌ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. బాబర్ చివరిగా 2023 ఆగస్ట్‌లో నేపాల్‌పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతని ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్‌లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.
చదవండి: విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్


