రాణించిన బంగ్లా బౌలర్లు | Ireland 8 Down For 270 Runs At Day 1 Stumps In 1st Test Against Bangladesh | Sakshi
Sakshi News home page

రాణించిన బంగ్లా బౌలర్లు

Nov 11 2025 4:58 PM | Updated on Nov 11 2025 5:29 PM

Ireland 8 Down For 270 Runs At Day 1 Stumps In 1st Test Against Bangladesh

రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్‌ 11) తొలి టెస్ట్‌ మొదలైంది. సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెటరన్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (60), కేడ్‌ కార్మిచేల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. కర్టిస్‌ క్యాంఫర్‌ (44), లోర్కన్‌ టకర్‌ (41), జోర్డన్‌ నీల్‌ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.

బ్యారీ మెక్‌కార్తీ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆటలో చివరి బంతికి జోర్డన్‌ నీల్‌ ఔటయ్యాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ డకౌట్‌ కాగా.. హ్యారీ టెక్టర్‌ 1, ఆండీ మెక్‌బ్రైన్‌ 5 పరుగులు చేసి ఔటయ్యారు.

బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ మిరాజ్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. హసన్‌ మురద్‌ 2, హసన్‌ మహమూద్‌, నహిద్‌ రాణా, తైజుల్‌ ఇస్లాం తలో వికెట్‌ తీశారు. కాగా, ఈ పర్యటనలో రెండో టెస్ట్‌ నవంబర్‌ 19 నుంచి ఢాకాలో జరుగుతుంది. అనంతరం నవంబర్‌ 27, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. 

చదవండి: శ్రేయస్‌ గాయం.. షాకింగ్‌ విషయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement