
పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీలో మరోసారి మార్పు చోటుచేసుకోనుందా? మళ్లీ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం(Babar Azam) జట్టు పగ్గాలను చేపట్టనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి పీసీబీ వర్గాలు. ప్రస్తుత వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది.
రిజ్వాన్ నాయకత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్నప్పటికి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. వ్యక్తిగత ప్రదర్శనపరంగా కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పీసీబీ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా జియో న్యూస్ ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సెలక్టర్లు కొత్త వన్డే కెప్టెన్ కోసం ముగ్గురిని షార్ట్ లిస్టు చేసిందంట. అందులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ అలీ ఆఘా ఉన్నారు. అయితే వీరిలో బాబర్ ఆజం ముందుంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాబర్ గత రెండేళ్లలో రెండు సార్లు పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న బాబర్.. ఆ తర్వాత మళ్లీ 2024 మార్చి జట్టు పగ్గాలను అతడు చేపట్టాడు. అయితే ఆరు నెలల తిరిగకుముందే మరోసారి కెప్టెన్సీని ఆజం వదులుకున్నాడు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాక్ కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు ఈ స్టార్ బ్యాటర్ సిద్దమయ్యాడు. బాబర్ ప్రస్తుతం గడ్డు పరిస్థుతులను ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతోంది. అంతేకాకుండా టీ20 జట్టు నుంచి కూడా సెలక్టర్లు అతడిని తప్పించారు. అయితే సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా