జింబాబ్వే, శ్రీలంకతో ముక్కోణపు టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పేలవంగా ఆరంభించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆజామ్ కేవలం మూడు బంతులే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఈ పాక్ మాజీ కెప్టెన్ దొరికిపోయాడు. బాబర్ ఆజమ్‌కు గత ఆరు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఇది మూడో డక్. ఈ క్రమంలో అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డౌకౌటైన రెండో పాక్ ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇంతకుముందు ఈ అవాంఛిత రికార్డు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో అఫ్రిదిని ఆజామ్ అధిగమించాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ ఆక్మల్, యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌లు సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు. ఆయూబ్, ఆక్మల్ టీ20ల్లో ఇప్పటివరకు పది సార్లు డకౌటయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ ఆటగాళ్లు వీరే..
👉సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్‌ల్లో)
👉ఉమర్ అక్మల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్‌ల్లో)
👉షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్‌ల్లో)
👉 కమ్రాన్ అక్మల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్‌ల్లో)
👉మహ్మద్ హఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్‌ల్లో)
👉మహ్మద్ నవాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్‌ల్లో)


