చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి! | An Open Letter To S Jaishankar From Pakistan Soil | Sakshi
Sakshi News home page

చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి!

Jan 2 2026 7:32 PM | Updated on Jan 2 2026 7:49 PM

An Open Letter To S Jaishankar From Pakistan Soil

బలూచిస్తాన్.. పాకిస్తాన్‌తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్‌తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్‌. గతంలో పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్‌ కూడా పాక్‌ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. 

అయితే  గతంలో భారత్‌ సాయం కోరిన బలూచిస్తాన్‌.. మరొకసారి భారత్‌ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జరిగిన పరిణామాల్లో  భారత్‌ సైన్యం తమతో కలిస్తే పాక్‌ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్‌.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్‌ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. 

బలూచ్‌ అగ్రనేత మిర్‌ యార్‌ బలూచ్‌.. ఈ మేరకు భారత్‌కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్‌ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్‌తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్‌ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రశంసలు
అదే సమయంలో పాక్‌తో యుద్ధంలో భాగంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై సైతం బలూచిస్తాన్‌ నేత మీర్‌ ప్రశంసలు కురిపించారు. . పాక్‌ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్‌.. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్‌.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలియజేశారు. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement