
ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. ప్రజాపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్.. ఒకవైపు కక్ష పూరిత పాలనను కొనసాగిస్తూ మరొకవైపు బారీగా అప్పులు చేయడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమం అనేది సామాన్యుడికి చేరకపోవడంతో అసలు అప్పులు చేసిన సొమ్మంతా ఎటుపోతుందనేది విశ్లేషకులు ప్రశ్న.
ఫలితంగా ఏపీలో అసలు పాలన ఉందా అనేది ప్రజల్లో తలెత్తుత్తోంది. రోజురోజుకి ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. ఏపీలో ప్రస్తుత అప్పుల భారం రూ. 5.6 లక్షల కోట్లుగా ఉంది.
ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి’(జీఎస్డీడీపీ)లో అప్పులు 34.7 శాతంగా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని నేటి(మంగళవారం, ఆగస్టు 12వ తేదీ) రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ తెలంగాణ అప్పుల భారం రూ. 4.4 లక్షల కోట్లుగా ఉంది. ఇది తెలంగాణ జీఎస్డీడీపీ 26.2 అప్పుల శాతంగా ఉంది. అంటే తెలంగాణ కంటే అప్పుల్లో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఎటువంటి ముందంజ లేని చంద్రబాబు ప్రభుత్వం.. అప్పులు చేయడంలో మాత్రం పరుగులు పెడుతుందనేది ఇక్కడ అందరికీ అర్ధమవుతున్న విషయం.