ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పరిధిలోగల కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై‘ఎక్స్’ పోస్ట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…— PMO India (@PMOIndia) November 1, 2025
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ ‘తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


