breaking news
kasibugga stampede
-
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. బాబు నిర్లక్ష్యంపై YS జగన్ ఆగ్రహం
-
తప్పు మీరు చేసి కాశీబుగ్గ గుడి కట్టించిన 90 ఏళ్ల వ్యక్తి ని జైల్లో పెట్టిన సర్కార్
-
కాశీబుగ్గ తొక్కిసలాటపై బాబు డైవర్షన్ డ్రామా..
-
చంద్రబాబు.. అంత భయమెందుకు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని..@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ తొక్కిసలాటకు ఉచిత బస్సు కారణమంటూ లోకేష్ అడ్డగోలు మాటలు
-
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.అనంతరం తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
బాబు డైవర్షన్ డ్రామా.. 18 నెలల్లో ఎన్ని కథలంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గతంలో పలుమార్లు కూటమి సర్కార్‌పై ప్రజాగ్రహం వచ్చిన ప్రతీసారి బాబు డైవర్షన్ డ్రామాలకు తెరలేపారు. దీంతో, డైవర్షన్ పాలిటిక్స్‌లో మాస్టర్‌గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ అరెస్ట్ జరిగింది. జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తామని మంత్రులు ఇప్పటికే చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు. 18 నెలల కాలంలో బాబు డైవర్షన్లు..2024లో విజయవాడ వరదల్ని డైవర్ట్ చేసేందుకు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టబోయారంటూ చంద్రబాబు డ్రామా.వంద రోజుల పాలన పూర్తి అయిన సమయంలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా.ఉచిత గ్యాస్‌పై ప్రజలు ప్రశ్నిస్తున్నారనగానే రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం.గత డిసెంబర్ తుపాను సమయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేషన్ తనిఖీల పేరుతో హడావుడి.తిరుపతి తొక్కిసలాటకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఎస్పీని వదిలేసి సంబంధం లేని అధికారులపై చర్యలు.చంద్రబాబు దావోస్ పర్యటన ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నాటకాలు.ఫిబ్రవరిలో ఏపీలో రిజిస్ట్రేషన్ల బాదుడు నుంచి డైవర్ట్ కోసం వంశీ అరెస్ట్.కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై దృష్టి మరల్చేందుకు పోసాని అక్రమ అరెస్ట్.ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్‌కు గుండుసున్నా పెట్టారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారు.సింహాచలం చందనోత్సవం వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు మిథున్ రెడ్డిపై కేసు. డైవర్షన్‌లో భాగంగా కాకాణి గోవర్థన్పై అక్రమ కేసు. ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ అరెస్ట్‌తో డైవర్షన్. కక్ష సాధింపులో భాగంగా..మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మంత్రి లోకేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు. -
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
-
అసంతృప్తితో బీజం.. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా ఖ్యాతి
పలాస: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అసంతృప్తితో బీజం పడింది. ఈ గ్రామానికి చెందిన హరిముకుందాపండా చాలా ఏళ్ల కిందట తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం సరిగా కాకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తనకు మిగిలిన అసంతృప్తి ఇంకెవరికీ కలగకూడదని భావించాడు. వీరిది ఒడిశా రాజకుటుంబం. హరిముకుందా తపనను గుర్తించిన ఆయన తల్లి హరివిష్ణుప్రియపండా సొంతంగా మనమే ఆలయం కట్టుకుంటే సరిపోతుందని ప్రోత్సహించింది. తల్లి మాటతో హరిముకుందా ఆలయ నిర్మాణానికి ఉపక్రమించారు.తిరుమల వేంకటేశ్వరస్వామిని పోలిన ఏకశిలా విగ్రహాన్ని తిరుమలలోనే తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభించారు. ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివస్తుండడంతో అనతికాలంలోనే ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలోనూ ఆలయ వీడియోలు వైరల్ అయి ట్రెండింగ్ అయ్యాయి. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ఖ్యాతికెక్కింది. ప్రతీ శనివారం వేలల్లో భక్తులు వస్తుంటారని పర్వ దినాల్లో 10 వేల నుంచి 15వేల మంది వరకు వస్తుంటారని అంచనా. ఈ శనివారం ఏకాదశి కావడంతో 25వేల మందివరకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. మంత్రి ఆనం, మంత్రుల వితండ వాదన ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి తమకు తెలియదని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం అందరినీ విస్తుగొలుపుతోంది. ఇతర మంత్రులు, టీడీపీ నేతలూ ఇది ప్రైవేటు ఆలయం అని, అక్కడ తొక్కిసలాట జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధమని వితండ వాదన చేయడంపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఈ ఆలయం తమ దృష్టిలో లేదని, ప్రభుత్వం వద్ద ఎక్కడా సమాచారం లేదని అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బందోబస్తు కావాలని నిర్వాహకుడు అడగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
అలసత్వాన్ని కప్పిపుచ్చి ‘ప్రైవేట్ దేవాలయమా’!
సాక్షి, అమరావతి: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే అది ఓ ప్రైవేట్ గుడి అంటూ టీడీపీ కూటమి సర్కారు తన వైఫల్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం చేయడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక ఉత్సవాల సమయంలో వీధిలో చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పోలీసులు పర్యవేక్షించి అనుమతి ఇస్తారని, అలాంటిది కాశీబుగ్గలో వేల మంది భక్తులు పాల్గొంటున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు చెప్పడం ఏమిటి? ప్రైవేట్ ఆలయమని బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యత్యాసం ఉండదు..దేవదాయశాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ గుడి, ప్రైవేట్ గుడి అనే వ్యత్యాసం ఉండదని, ఆయా ఆలయాల పర్యవేక్షణ శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 26,968 ఆలయాలు ఉండగా దాదాపు 20 వేల ఆలయాలకు ఈవోలే లేరని చెబుతున్నారు. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఏ ఉద్యోగికీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించదు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకల నుంచే జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్, ప్రభుత్వం అనే ప్రస్తావన ఉండదని స్పష్టం చేస్తున్నారు. భద్రత బాధ్యత ప్రభుత్వానిదేదేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి్సన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. అందుకే ఎంత పెద్ద ఉత్సవం జరిగినా పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉందని ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ఆలయాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో సైతం సీసీ కెమేరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ల ప్రాణాలు బలిగొంది
ప్రభుత్వమే మా వాళ్ల ప్రాణాలు బలిగొందని కాశీబుగ్గ తొక్కిసలాట బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చారని, భద్రతా చర్యలు అసలే లేవని విమర్శించారు. కూటమి సర్కారు తీరుపై ఆక్రోశించారు.నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణంస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఆలయం వద్ద ఒక్క పోలీసూ లేరు. సరైన బందోబస్తు నిర్వహించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇది ముమ్మాటికీ అధికార యంత్రాంగం లోపమే. ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. మా కుటుంబానికి తీరని దుఖం మిగిలింది. నేను ఒంటరినయ్యాను. – మృతురాలు అమ్ములు భర్త రాజారావు, సూర్యకుండ కాలనీ, పలాససర్కారు నిర్లక్ష్యం వల్లే అమ్మ బలైందిదైవ దర్శనానికి వెళ్లిన మా అమ్మ ప్రాణం పోయింది. ఆరోగ్యంగా వెళ్లిన అమ్మ విగత జీవిగా బయటకొచ్చింది. ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత. వేలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసి కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంత నష్ట పరిహారం ఇస్తే ఏం ప్రయోజనం. మా అమ్మ తిరిగి వస్తుందా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.– రాజేశ్వరి కుమారుడు వైకుంఠరావు, బెల్లుపటియా, మందస మండలంరక్షణ ఏర్పాట్లు లేవుగుడి దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. అంతమంది జనాలు వచ్చే గుడికి పోలీసులు కాపలా ఉండాలి. కానీ అక్కడ పోలీసులు లేరు. అన్నీ అయిపోయాక పోలీసులు కాశీబుగ్గంతా నిండిపోయారు. – రాపాక గవరయ్య, పిట్టల సరియా, మృతురాలు రాపాక విజయ బావసర్కారు పర్యవేక్షణేదీ? కార్తీక ఏకాదశి మంచిరోజని దేవుడి దర్శనం కోసం కాశీబుగ్గలోని చిన్న తిరుపతి వెళ్లాం. ఒక్కసారిగా తోపులాట జరగడంతో పడిపోయాం. మా వదిన మురిపింటి నీలమ్మపై జనాలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె కింద పడిపోయి నా కళ్ల ముందే చనిపోయింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. – దుక్క తవిటమ్మ, దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం ఘోరానికి కారణం ప్రభుత్వమే నిఖిల్‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఒంటరి చేసి వదిలివెళ్లిపోయాడు. మా కంటిదీపం ఆరిపోయినట్లయ్యింది. ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగింది. – లొట్ల పార్వతి, నిఖిల్ పెద్దమ్మ సరైన చర్యల్లేవుతిరుపతి వెళ్లలేక దగ్గరలో ఉన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కూడా లేకపోవడం వల్ల మహాఘోరం జరిగింది. తొక్కిసలాట ఘటనలో మా పిన్ని మృతి చెందింది. – కొర్రాయి అప్పయ్య, మృతురాలు యశోద అక్క కుమారుడు, శివరాంపురంఇంత నిర్లక్ష్యమా? కళ్లముందే ముగ్గురు మృతిదర్శనం చేసుకొని బయటకు వచ్చే తలుపులు తీయడంతో ఒక్కసారిగా లోపలకి వెళ్లేవారు, బయటకు వచ్చేవారు తోసుకోవడంతో కింద పడిపోయాం. మా మీద మరి కొంత మంది పడిపోయారు. నా కిందనే పడిన ముగ్గురు ఆడవాళ్లు చనిపోయారు. కొద్ది సేపు అయి ఉంటే నేను కూడా చనిపోయే దాన్ని. – కూర్మాపు హిమ, ప్రత్యక్ష సాక్షి, నందిగాంఇలాంటి కష్టం పగవాళ్లకూ రాకూడదు నేను నా భార్య దర్శనానికి వెళ్లాం. తోపులాటలో నా భార్య కిందపడిపోయింది. మరో ఐదుగురు ఒకరిపై ఒకరు పడ్డారు. ఆ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగో నా భార్యను కాపాడుకోగలిగాను. ఇలాంటి కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. – దుంప రుషికేశ్వరరావు, సీతారాంపురం, వజ్రపుకొత్తూరు మండలం ఒక్క పోలీసూ లేరు మాది వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామం. మా బంధువులతోపాటు మరో 10 మంది దర్శనం కోసం వచ్చాం. దర్శనానికి వెళ్తుండగా మెట్ల వద్ద తోపులాట జరిగింది. 30 నిమిషాలకుపైగా ఆలయంలో ఇరుక్కుపోయాం. అనేక మంది మహిళలు కింద పడిపోయారు. తొక్కిసలాట సమయంలో ఒక్క పోలీసూ లేరు. – దుబ్బ బోడెయ్య, షణ్ముఖరావు అంబులెన్సులూ సమయానికి రాలేదు మాది నందిగాం మండలం శివరాంపురం గ్రామం. ఏకాదశి రోజు టెక్కలిలోని విష్ణుమూర్తి గుడికి వెళ్లాల్సి ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చునంటూ పలాస–కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి మా ఊరి వారితో కలిసి నా భార్య వెళ్లింది. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడింది. జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంబులెన్సులూ సమయానికి రాలేదు. – బోరసింగు కామేష్, నందిగాం ముప్పావు గంట ఊపిరాడలేదు.. సర్కారుదే పాపంతొక్కిసలాటలో రెయిలింగ్ నుంచి మెట్ల పక్కన జారిపోయి కిందపడిపోయాను. నా మీద పది నుంచి పదిహేను మంది పడిపోయారు. ముప్పావు గంట వరకు పడిపోయిన నన్ను ఎవరూ బయటకు తీయలేదు. ఊపిరాడక పోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. తొక్కిసలాటలో నా కాళ్లు బెణికిపోయి, నడవలేని పరిస్థితి నెలకొంది. సరైన భద్రత చర్యలు తీసుకోని సర్కారుదే ఈ పాపం. – రోణంకి రమాదేవి, క్షతగాత్రురాలు, తేలినీలాపురం, టెక్కలి మండలం సహాయ చర్యల గురించి పట్టించుకోలేదుఉదయం 10 గంటలకు ఆలయానికి వెళ్లిన మేము 11.30 గంటలకు దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా తలుపులు తెరవడంతో, బయట నుంచి వచి్చన భక్తులు లోపలికి వెల్లువలా పరుగులు తీశారు. దీంతో ఒకవైపు స్టీలు రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో జనం మధ్య తొక్కిసలాట జరిగింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యల గురించి సర్కారు పట్టించుకోలేదు. – గున్న చిట్టెమ్మ, గణేష్ కాలనీ, నందిగాం గ్రామం తలుపు తీయడంతో తోపులాట దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చే తోవలో ఉన్న గేటు వేసేశారు. తలుపు తీయకపోవడం వల్ల జనాలు పెరిగిపోయారు. తర్వాత ఒక్కసారిగా తలుపు తీయడంతో తోపులాట జరిగింది. కింద పడిపోయిన వారు చనిపోయారు. – కొర్రాయి శీలమ్మ, శివరాంపురం, సంఘటన ప్రత్యక్ష సాక్షి ఆస్పత్రికి తీసుకెళ్లే నాథుడే లేడుమా దర్శనం అయిపోయింది. బయటకు వస్తుండగా క్యూ ఆగిపోయింది. 10 నిమిషాలు అయ్యాక తోపులాట జరిగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు మహిళలు కింద పడిపోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ కానరాలేదు. – చెలియ మోహిణి సరియాపల్లి, మందస మండలం ఘటన జరిగిన తర్వాతైనా స్పందించలేదుమేము దర్శనానికి వెళ్లేటప్పుడు అంతా సజావుగా ఉంది. 10 గంటల సమయంలో రద్దీ బాగా పెరిగింది. ఆలయం లోపల ఉన్నాం. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాట జరిగింది. నాతో పాటు వచ్చిన పైల సీతమ్మ, నర్సమ్మలకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన తర్వాతైనా సర్కారు స్పందించలేదు. – పైల జయమ్మ, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలంభద్రత సర్కారు బాధ్యత కాదా?మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. గేటు వేసి ఉంది. ముందుకు వెళ్లేందుకు అవకాశం లేక మెట్లపై నిలబడ్డాం. వెనుక నుంచి అరుపులు వినిపించాయి. దీంతో ముందున్న తలుపులు తెరిచారు. ఒక్క సారి అందరం ముందుకు వెళ్లాం. అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఎలాగో తప్పించుకొని బయటపడ్డాం. ఇది సర్కారు పాపమే. భద్రత సర్కారు బాధ్యత కాదా?– పిట్ట జగన్నాయకులు, ధర్మవరం ప్రభుత్వం వల్ల రెండుకాళ్లూ పోయాయ్ కార్తీక ఏకాదశి నాడు భక్తిభావంతో వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చాను. ఇక్కడ సరైన బందోబస్తు లేకపోవడంతో తొక్కిసలాటలో రెండు కాళ్లూ పోగొట్టుకొన్నాను. మా కుటుంబానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చెలియా కాంతమ్మ, సరియాపల్లి, మందస మండలం -
దేవుడా!.. చంద్రబాబు పొలిటికల్ పాలన
2015లో చంద్రబాబు ప్రచార కండూతితో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట.. 29 మంది మృతివిచారణ నివేదికను తొక్కిపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వంఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్లో తొక్కిసలాట. ఆరుగురు సామాన్య భక్తులు మృతి.ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి గాల్లో కలిసిన ఏడుగురు భక్తుల ప్రాణాలు.నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల దుర్మరణం.సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన తేవడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి... దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకు భరోసా కరువైంది! కేవలం పది నెలల కాలంలో మూడు ఆలయాలలో మూడు ఘోర దుర్ఘటనలు. ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని ఉంటే, అన్ని గుడుల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే దారుణాలు జరిగేవి కాదన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వరుస దుర్ఘటనల్లో భక్తులు దుర్మరణం చెందుతున్నా, పోయేది సామాన్యుల ప్రాణాలే కదా అన్నట్లు చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పాపాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ని విషాదాలు జరుగుతున్నా అమెరికా కంటే గొప్ప టెక్నాలజీ తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తుపానునే కంట్రోల్ చేశానని, సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజ్ఞుడినని చెప్పుకొంటూ సీఎం ప్రచార ఆర్భాటంతో కాలం వెలిబుచ్చుతున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోతున్నా నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని, కనీసం మంచినీళ్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.29 మందిని బలిగొన్న బాబు ప్రచార కండూతి» చంద్రబాబు ప్రచార కండూతి 2015 గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29మంది భక్తుల దుర్మరణానికి కారణమైంది. రాజమహేంద్రవరం ఘాట్ వద్ద వేలాది భక్తుల సమక్షంలో సీఎంగా బాబు కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం చేసేలా వీడియో తీయాలని భావించారు. ముందు రోజే ఘాట్ గేట్లు మూసి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పడిగాపులు కాసేలా చేశారు. చంద్రబాబు రాగానే గేట్లు తెరిచారు. భక్తులు ఒక్కసారిగా స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయంగా మారింది. దీనిపై బాబు కనీసం నైతిక బాధ్యత తీసుకోలేదు. పైగా పుష్కరాల దుర్ఘటనపై విచారణ కమిషన్ నివేదికను తీవ్ర జాప్యం చేశారు. చివరికి ఎవరి బాధ్యత లేదని తేల్చారు.» ఇక 2017లో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవ్రిత సంగమం వద్ద కృష్ణా నదిలో పర్యాటకుల బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. » 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండే 30పైగా ఆలయాలను కూల్చివేశారు.» తిరుమలలో 1472లో నిర్మితమైన వేయి కాళ్ల మండపాన్ని 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూల్చివేశారు. » చంద్రబాబు హయాంలోనే... విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇంకోవైపు, చంద్రబాబు గతంలో సీఎంగా కొనసాగిన సమయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ ఎగతాళిగా మాట్లాడారు.కూటమి పాలనలో అపచారాలు ఎన్నో...» తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో ఈ ఏడాది జనవరి 8న తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోయింది. » తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో జనవరి 13న షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. » ఈఏడాది ఫిబ్రవరి 18న శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట టీటీడీ ఉద్యోగి, పాలకమండలి సభ్యుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మార్చిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర కాశినాయన క్షేత్రంలో అన్నదాన భవనం, సత్రాలు, గోశాలను కూల్చివేశారు. » ఏప్రిల్‌లో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో వెలిశారని భక్తులు విశ్వసించే శ్రీ కూర్మంలో పెద్దసంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి.»300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేట బాల శశిశేఖర ఆలయంలో ఈ ఏడాది మే 18న కొందరు వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్‌సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్‌సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్‌ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ పొంతన లేని మాటలు
శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.దీనిలో భాగంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్ మాటల్లో తడబాటు కనబడింది. ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణంపోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నించింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ. -
తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: వైఎస్ జగన్
తాడేపల్లి: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో తనను మించిన వారు లేరంటూ చంద్రబాబు ప్రతీరోజూ గొప్పలు చెప్పుకోవడం ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్’ఎక్స్’లో చంద్రబాబు పాలనపై మండిపడ్డారు వైఎస్ జగన్.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబుగారు ప్రజల భద్రతనే కాదు, ఈ రకంగా ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకి ఉన్న శ్రద్ధ, ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు.ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్పస్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చినజీయర్‌స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తోందని అంటే…,దీని అర్థం తప్పు జరిగినట్టే కదా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారు. కాని, ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది.ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది మరణించారు. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, సత్వర చికిత్స అందించి, ఇద్దరు భక్తుల ప్రాణాలను కాపాడటమే కాదు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మా డాక్టర్ అప్పలరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణం’
కాకినాడ: కాశీబగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ‘ సాక్షి’ తో మాట్లాడిన ఆయన.. కాశీబుగ్గ దర్ఘటన అనేది అత్యం దురుదృష్టకరం. ప్రభుత్వ వైఫల్యం..నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చినప్పుడు ఆలయం వద్ద ప్రభుత్వం ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంది?, తిరుమల, సింహచలం, కాశిబుగ్గ ఘటనలు కలిచి వేస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 23 వేల దేవదాయ శాఖకు చెందిన ఆలయాలు దిక్కు మొక్కు లేకుండా ఉన్నాయి.. ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కట్టినా...ఆ ఆలయాలకు భక్తులు తరలివస్తే.. దానిని ప్రైవేటు టెంపుల్‌గా చూడవద్దని కోర్టు తీర్పులు చెబుతున్నాయి.పర్వదిన్నాల్లో ఏ ఆలయాలకు ఎంత మంది భక్తులు వస్తారో అని పోలీసు శాఖకు అంచనాలేదు. సిని తారాలకు మాత్రం భారీగా బందోబస్తు ఉంటుంది. పోలీసు అధికారుల నుండి హోం మంత్రి వరకు భక్తుల విషయంలో చాల నిర్లక్ష్యంగా ఉన్నారు. రాష్ట్రంలో రూల్ బుక్ లేదు...రెడ్ బుక్ మాత్రమే ఉంది. ఘటనపై విచారణ జరిపి, భాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’అని కురసాల కన్నబాబు సూచించారు.కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: 9 మంది మృతి -
కాశీబుగ్గ తొక్కిసలాట.. పలాస ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట: మృతులు వీరే..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాపాక విజయ(48)-టెక్కిలి, రామేశ్వరానికి చెందిన ఏదూరి చిన్మమ్మి(50)-రామేశ్వరం, మురిపించి నీలమ్మ(60)-దుక్కవానిపేట, దువ్వు రాజేశ్వరి(60)-చెలుపటియా, యశోదమ్మ(56) శివరాంపురం, రూప(గుడిభద్ర), డోక్కర అమ్ము(పలాస), నిఖిల్(13)-బెంకిలి, బృందావతి(62)-మందసగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట బాబు సర్కార్ వైఫల్యమే: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని.. భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు హిందూ ధర్మ వ్యతిరేకి.. ఆయన పాలనలోనే వరుసగా ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.‘‘కాశీబుగ్గ ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేట్ ఆలయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఎప్పుడూ లేని అపచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు చనిపోయారు. సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. చంద్రబాబుకు హిందూ ఆలయాల మీద ఏనాడూ ప్రేమ లేదు. తన పబ్లిసిటీ కోసం తప్ప ఆలయాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదు. గోదావరి పుష్కరాలలో 29 మంది మృతికి కారణమయ్యారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనే వారికి లేదు...చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆనం రామనారాయణరెడ్డి తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతున్నారు. కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు వెళ్తారన్న సంగతి తెలీదా?. ఆలయాలు నిర్మించటం తప్పు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. ఏ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేయలేరా?. ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది?. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటానికే పోలీసులను వాడుకుంటారా?. ప్రైవేటు వ్యక్తులు ఆలయాలు కట్టటం తప్పా?..విజయవాడలో ప్రయివేటు వ్యక్తుల ఉత్సవాలకు పోలీసుల బందోబస్తు నిర్వహిస్తారా?. అదే ఆలయాల దగ్గర మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయరా?. మా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చాలామంది భక్తులను కాపాడారు. సీపీఆర్ చేసి రక్షించారు. హోంమంత్రి అనితకు పోలీసు వ్యవస్థ మీద ఏమాత్రం పట్టు లేదు. ఆమె ఎంతసేపటికీ మా పార్టీ వారిపై దూషణలు చేయటానికే పరిమితం అయ్యారు. గోశాలలో ఆవులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు...చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదేనా ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్న భక్తి?. చంద్రబాబు విజయవాడలో ఆలయాలను కూల్చి మున్సిపాలిటీ చెత్తలారీలో విగ్రహాలను తీసుకెళ్లారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సినిమా షూటింగ్ లో ఉన్నారు?. జరిగిన తప్పుపై ఎందుకు మాట్లాడటం లేదు?. ఆలయాలపై రాజకీయ కుట్రలు మానుకోవాలి. తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేసిన చరిత్ర టీడీపీది’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. -
కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు రియాక్షన్
-
కాశీబుగ్గ ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆలయ వర్గాలతో పోలీసులు సమీక్ష చేయలేదు. విఐపీలు దర్శనానికి వస్తున్నా కానీ భద్రతా లోపాలను అధికారులు గుర్తించలేదు.దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు, వేచి వుండే షెడ్లో ఫ్యాన్లు, వెంటిలేటర్ ఫ్యాన్లు కనిపింయలేదు. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి భక్తులు స్పృహ కోల్పోయారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట: రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పరిధిలోగల కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై‘ఎక్స్’ పోస్ట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…— PMO India (@PMOIndia) November 1, 2025రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ ‘తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
తొక్కిసలాట: మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన భక్తులు
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట.. స్పాట్ లోనే క్షతగాత్రులకు సీదిరి అప్పలరాజు ట్రీట్మెంట్
-
కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి.... తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలోనూ దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన వల్ల ఇప్పటిదాకా 10 మంది మరణించారని తెలుస్తోంది. ఈ 18 నెలలకాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అని జగన్ పేర్కొన్నారు. -
ప్రచారమే ప్రాణం తీసింది.. కాశీబుగ్గ ఆలయ వివరాలు..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 ఎకరాల్లో ఆలయం..కాశీబుగ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా, తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక, కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్దిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు.గుడి నిర్మించిన హరి ముకుంద పాండా25వేల మంది భక్తులు.. దీంతో, ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. కాగా, భక్తుల రద్దీని పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. ఆలయ కమిటీ సొంతగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసు సిబ్బంది రాలేదు. గంట సమయం దాటినా ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. ప్రమాదం ఎలా జరిగిందంటే ?
-
కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట..
-
కాశీబుగ్గ క్షతగాత్రులకు సీదిరి వైద్యం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు. -
తిరుపతితో మొదలు.. అసలేందుకీ తొక్కిసలాటలు?
దేశ చరిత్రలోనే 2025 ఏడాది ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. మునుపెన్నడూ లేని రీతిలో.. ఈ యేడు వరుసగా తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని అత్యంత విషాదకరమైనవిగా నిలిచాయి. అధిక జనసమూహం, భద్రతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. ఆ ఘటనలను పరిశీలిస్తే.. తిరుపతి తొక్కిసలాట.. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 8వ తొక్కిసలాట జరిగి.. ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు కౌంటర్ల వద్ద భారీగా గుమికూడారు. ఆ సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో గేట్‌ను తెరిచారు. దీంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కుంభమేళాలో మహా విషాదం.. జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య పుణ్యస్నాన దినాన లక్షలాది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి చేరుకున్నారు. అయితే.. చీకట్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో స్పష్టత కొరవడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో.. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. రైల్వే అనౌన్స్మెంట్లో తీవ్ర గందరగోళం, అప్పటికే ప్లాట్‌ఫారమ్ 14, 15 వద్ద అధిక జనసంచారం, రైలు రాకతో ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుంటూ ప్లాట్‌ఫారమ్‌లపైకి చేరడంతో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపమే ఈ ఘటనకు కారణమని తర్వాత తేలింది.బెంగళూరు స్టేడియం బయట.. జూన్ 4వ తేదీన బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా నెగ్గడంతో.. విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. అంచనాలకు మించి అభిమానులు రావడం.. వాళ్లను అదుపు చేయలేకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.కరూర్ ఘటన.. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. నిర్వహణ లోపమని, విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న జనం గందరగోళానికి గురై తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ కుట్ర అంటూ టీవీకే ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు నడుస్తోంది.కాశీబుగ్గ ఆలయం వద్ద.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. -
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృతులు వీరే..ఇదురి చిన్నమ్మి(50),రామేశ్వరం, టెక్కలిరాపాక విజయ(48), టెక్కలిమురిపింటి నీలమ్మ(60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరుదువ్వు రాజేశ్వరి(60), బెలుపటియ, మందసచిన్ని యశోదమ్మ(56), శివరాంపురం, రూప, గుడిభద్రలొట్ల నిఖిల్(13), బెంకిలి, సోంపేటడొక్కర అమ్ముడమ్మ, పలాసబృందావతి(62), మందస కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.


