కాకినాడ: కాశీబగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ‘ సాక్షి’ తో మాట్లాడిన ఆయన.. కాశీబుగ్గ దర్ఘటన అనేది అత్యం దురుదృష్టకరం. ప్రభుత్వ వైఫల్యం..నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది.
వేలాదిగా భక్తులు తరలివచ్చినప్పుడు ఆలయం వద్ద ప్రభుత్వం ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంది?, తిరుమల, సింహచలం, కాశిబుగ్గ ఘటనలు కలిచి వేస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 23 వేల దేవదాయ శాఖకు చెందిన ఆలయాలు దిక్కు మొక్కు లేకుండా ఉన్నాయి.. ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కట్టినా...ఆ ఆలయాలకు భక్తులు తరలివస్తే.. దానిని ప్రైవేటు టెంపుల్‌గా చూడవద్దని కోర్టు తీర్పులు చెబుతున్నాయి.
పర్వదిన్నాల్లో ఏ ఆలయాలకు ఎంత మంది భక్తులు వస్తారో అని పోలీసు శాఖకు అంచనాలేదు. సిని తారాలకు మాత్రం భారీగా బందోబస్తు ఉంటుంది. పోలీసు అధికారుల నుండి హోం మంత్రి వరకు భక్తుల విషయంలో చాల నిర్లక్ష్యంగా ఉన్నారు.
రాష్ట్రంలో రూల్ బుక్ లేదు...రెడ్ బుక్ మాత్రమే ఉంది. ఘటనపై విచారణ జరిపి, భాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’అని కురసాల కన్నబాబు సూచించారు.


