సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్ నిలదీశారు.
భూమి, బిల్డింగ్‌లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.


