సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తన ఖతాలో వేసుకున్న చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు.
ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పేరును మార్చి ఇకపై వాటిని ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలిగింది. పలు శాఖల పనులను ఒకే కేంద్రంలో సమీకరించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
కొత్త పేరుతో కొనసాగింపు
అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఈ వ్యవస్థను కొనసాగిస్తూ..దానికి కొత్త పేరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘స్వర్ణ గ్రామాలు’ అనే పేరుతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు.
చంద్రబాబుపై విమర్శలు
చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్చి క్రెడిట్ తీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.


