సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆలయ వర్గాలతో పోలీసులు సమీక్ష చేయలేదు. విఐపీలు దర్శనానికి వస్తున్నా కానీ భద్రతా లోపాలను అధికారులు గుర్తించలేదు.
దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు, వేచి వుండే షెడ్‌లో ఫ్యాన్‌లు, వెంటిలేటర్ ఫ్యాన్‌లు కనిపింయలేదు. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి భక్తులు స్పృహ కోల్పోయారు.


