సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.



