తాడేపల్లి: పితృ వియోగం కల్గిన టీవీ-9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు సురేష్‌లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరిమర్శించారు.
రజనీకాంత్ తండ్రి వెల్లల చెరువు సాంబశివరావు మృతిపై, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు సురేష్ తండ్రి వెంకటామిరెడ్డి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వీరికి ఫోన్ చేసిన వైఎస్ జగన్.. ఇలాంటి కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.


