మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాల అందజేత
దీనికి ముందు ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి రాజ్ భవన్‌కు పంపే కార్యక్రమం
తర్వాత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో భేటీ
ఈ సమావేశం తర్వాత రాజ్ భవన్‌కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి (డిసెంబర్ 18) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉంటారు.
దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి రాజ్ భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమం తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం రాజ్ భవన్‌కు బయల్దేరి వెళ్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో నిండిన వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.


