జగనన్న అంటే ప్రజల గళం.. జగనన్న అంటే ప్రజల బలం.. జగనన్న అంటే ప్రతి ఇంటి వెలుగు.. జగనన్న అంటే ప్రతి మనసు నమ్మకం.. జగనన్న అంటే ప్రజల ఆశ.. జగనన్న అంటే ప్రజల విజయం.. జగనన్న అంటే మన అందరి భవిష్యత్తు.. ఓవరాల్‌గా చెప్పాలంటే జగనన్న అంటే ప్రజల ధైర్యం.
విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు సైతం ఇదే ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ వద్దకు జగనన్న రావడంతో ధైర్యమొచ్చిందన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే చేస్తారనే నమ్మకం ఆయన కల్పించారని ఆ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందనే బాధను దిగమింగుతూనే జగనన్న రాక ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారమే జగనన్న తమ వద్దకు వచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితుల్ని నేడు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో 42 మందిని అన్యాయంగా రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు.

కాగా, విజయవాడలోని జోజినగర్‌లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.
అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని ఈరోజు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు.
ఇవీ చదవండి:
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్


