ఢిల్లీ: తెలుగు మీడియాకు ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏపీ భవన్‌లో మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రి లోకేష్ ఏపీ భనవ్‌కు రావడంతో అధికారులు ఎక్కడాలేని హడావుడి చేశారు. ఇదంతా బాగానే ఉన్నా తెలుగు మీడియాకు అక్కడ అనుమతి లభించలేదు. తెలుగు మీడియా అక్కడకు రావడంపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశానికి మీరెందుకు వచ్చారని లోకేష్ ప్రశ్నించారు.
‘‘మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదు’’ అంటూ మీడియా ప్రతినిధులను లోకేష్ అవమానించారు. దాంతో పలువురు మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. తెలుగు మీడియాకు అనుమతి లేదని ఐ & పి ఆర్ అధికారులు సైతం వెల్లడించారు. ఏపీ భవన్‌లో సమావేశం పెట్టి ఏపీ మీడియాను అధికారులు అనుమతించకపోవడం ఏంటనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలు.


