బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...
రాజావారి విందు భోజనం
రాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్‌వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.

కల్యాణ్‌ను ఓడించిన తనూజ
తర్వాత బిగ్‌బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్‌తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్‌లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్‌ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


