చాలామంది హీరోయిన్లు నన్ను రిజెక్ట్‌ చేశారు: హీరో | Rajini Ganesh Says Many Lead Actresses Rejected To Act With Him, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో

Nov 14 2025 8:17 AM | Updated on Nov 14 2025 10:30 AM

Rajini Ganesh Says Many Lead Actresses Rejected to Act With Him

‘‘నేను హీరోగా నటిస్తున్న మూడవ చిత్రం రజనీ గ్యాంగ్‌. స్టార్‌ హీరో కావాలన్నది నా డ్రీమ్‌. అందుకోసం చాలా కథలు విన్నాను. అలాంటి సమయంలో దర్శకుడు రమేష్‌ భారతి మూడు కథలు చెప్పారు. రజనీ గ్యాంగ్‌ కథలో నటించమని ఆయనే సూచించారు. వినోదభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని చెప్పారు. మొదట్లో ఈ చిత్రాన్ని నేను నిర్మించకూడదని భావించాను, అయితే ఆ తర్వాత నేనే నిర్మించడానికి సిద్ధమయ్యా.. 

చాలామంది రిజెక్ట్‌
ఇందులో ప్రముఖ నటీనటులను ఎంపిక చేశాం. నాకు మాత్రం హీరోయిన్‌ సెట్‌ కాలేదు. నా సరసన నటించడానికి చాలామంది ప్రముఖ హీరోయిన్లు నిరాకరించారు. చివరిగా నటి దివిక వచ్చారు. నాకు జంటగా నటించడానికి అంగీకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు. ఇందులో నటుడు మొట్టై రాజేంద్రన్‌, మునీష్‌ కాంత్‌, కూల్‌ సురేష్‌, కల్కీరాజా వదలకు పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. బబ్లూ అనే ఒక కుక్క కీలక పాత్రను పోషించింది. 

నవంబర్‌లోనే..
చిత్రంలో మూడు పాటలున్నాయి. వాటిని సంగీత దర్శకుడు ఎంఎస్‌ జోన్స్‌ రూబర్ట్స్‌ జనరంజకంగా రూపొందించారు. ఎన్‌ఎస్‌ సతీష్‌ కుమార్‌ ఛాయాగ్రహణం అందించారు. హారర్‌, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ‘‘ అని తమిళ హీరో, నిర్మాత రజిని కిషన్‌ పేర్కొన్నారు. మిశ్రీ ఎంటర్‌ ప్రైజస్‌ పతాకంపై ప్రముఖ దివంగత ఫైనాన్షియర్‌ ఎస్‌.సెయిన్‌ రాజ్‌ జైన్‌ దివ్య ఆశీస్సులతో రజనీ కిషన్‌ నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement