breaking news
punched in the face
-
Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం
అంకారా: టర్కీ పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సమక్షంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది చివరకు పరస్పర దాడులకు దారితీసింది. నూతన న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణల నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా న్యాయశాఖ మంత్రిగా నియమితులైన అకిన్ గుర్లెక్‌ను పోడియం వద్దకు రాకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. అధికార ఏకే పార్టీ సభ్యులంతా గుర్లెక్‌కు రక్షణగా నిలవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సభా విరామం అనంతరం భారీ భద్రత మధ్య గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.గుర్లెక్ నియామకం దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎర్డోగాన్ రాజకీయ ప్రత్యర్థిగా భావించే ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై గుర్లెక్ కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది అవినీతి ఆరోపణలపై ఇమామోగ్లును అరెస్ట్ చేయగా, గుర్లెక్ ఆయనపై ఏకంగా 142 నేరాలకు సంబంధించి అభియోగపత్రం దాఖలు చేశారు. ఇందులో గరిష్టంగా 2,000 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.అధ్యక్షుడు ఎర్డోగాన్ చేపట్టిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో న్యాయశాఖతో పాటు అంతర్గత వ్యవహారాల శాఖలోనూ మార్పులు జరిగాయి. ఎర్జురం ప్రావిన్స్ గవర్నర్ ముస్తాఫా చిఫ్చిని కొత్త అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న మున్సిపాలిటీలపై ప్రభుత్వం అవినీతి నిరోధక దాడులను ఉధృతం చేసిన తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వందలాది మంది ప్రతిపక్ష మున్సిపల్ అధికారులను అరెస్ట్ చేశారు. ఈ తాజా నియామకాలు టర్కీ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: భారత్‌తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్ -
టీవీ డిబేట్లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో
ఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్ లైవ్ డిబేట్లో సహనాన్ని కోల్పోయారు. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై పిడిగుద్దులు కురిపించారు. అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా గందరగోళం జరిగింది. ఇది కాస్తా ముదిరి శారీరక ఘర్షణగా మారిపోయింది. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై దాడికి దిగారు. అవతలి వ్యక్తి దానిని ప్రతిఘటించి రామ్‌దేవ్‌ను స్టూడియో ఫ్లోర్‌పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.హర్యానాలో ఇది ఫ్యామస్ అంటూ కొన్ని వ్యాయామాలు చేశారు రామ్‌దేవ్. ఆ తరువాత ఛాలెంజ్ అంటూ తోటి ప్యానలిస్ట్‌పై లంఘించారు. ఇలా కొద్ది క్షణాలు సాగిన తరువాత ఇది జోక్‌గానే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అతనికి శక్తిలేదు ఒప్పుకున్నాడు... అతనికోసం చప్పట్లు అంటూ అక్కడున్నవారిని ఉత్సాహపరచడంతో ఈ వివాదం సద్దు మణిగినట్టు అయింది. కాగా టెలివిజన్ చర్చల సమయంలో ఇలాంటి వింత ప్రవర్తనలతో రామ్‌దేవ్ ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా కమెంట్ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. వార్తా వేదికలు "కుస్తీ వేదికలు"గా మారాయని అనేక మంది వినియోగదారులు వ్యాఖ్యానించగా, ఛానెల్స్ చర్చల పేరుతో, "TRPల కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మరికొందరు ఆరోపించారు. Leaving this here. pic.twitter.com/jyIilfWHkz— Piyush Rai (@Benarasiyaa) December 20, 2025 -
బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్ ఖన్నా వాన్వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. -
ఐరిస్‌తోనే రేషన్!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పౌర సరఫరాల శాఖ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఐరిస్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ అందించే ప్రక్రియను మే నెల నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఐరిస్ మిషన్లు జిల్లాకు వచ్చేశాయి. వీటిని వారం రోజుల్లో రేషన్ డీలర్లకు పంపిణీ చేయనున్నారు. మే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని 751 రేషన్ దుకాణాల్లో ఇకపై ఈ నూతన విధానం ద్వారా సరుకులు పంపిణీ కానున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా, జవాబుదారీతనంగా చేయడానికి ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం అమలవుతున్న విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అరికట్టేందుకు 2017లో ఈ–పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అక్రమాలకు కళ్లెం పడడంతో పాటు ప్రభుత్వానికి మిగులు బియ్యం పెరి గి ఖర్చు తగ్గినట్లయింది. అయితే, కొంత మంది లబ్ధిదారుల వేలి ముద్రలు వివిధ కారణాలతో బయోమెట్రిక్ మెషిన్లో రాకపోవడంతో వారికి రేషన్ అందించడం కష్టమవుతోంది. స్థానిక వీఆర్వో సర్టిఫికేషన్ చేస్తేనే రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం అందజేస్తున్నారు. జిల్లాలో మొత్తం 751 రేషన్ దుకాణాల పరిధిలో 3,89,827 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులందరికీ కలిపి ప్రతి నెలా దాదాపు 8,185 మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు కిరోసిన్, గోధుమలను ఈ–పాస్ విధానంతో అందజేస్తున్నారు. వేలి ముద్రలు రాక ప్రతి నెలా దాదాపు 5,500 మందికి పైగా లబ్దిదారులు వీఆర్వో సర్టిఫికేషన్‌తో సరుకులు పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించి సరుకులకు కాజేసి ఎక్కువ ధరకు బాక్ల్ మార్కెట్ తరలిస్తున్నారనే ఆరోపణలు ఇంకా వినిపిస్తున్నాయి. అలాగే లబ్ధిదారులు చనిపోయినా, రేషన్ తీసుకోకపోయినా డీలర్ వారి సరుకులను పొందినట్లుగా రికార్డుల్లో చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఐరిస్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో నూరు శాతం అక్రమాలకు చెక్ పడనుంది. ఐరిస్ మిషన్లను, బయోమెట్రిక్ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. లబ్ధిదారులకు ముందుగా వారి వేలి ముద్రల ఆధారంగా రేషన్ ఇస్తారు. వేలి ముద్రలు రాని పక్షంలో ఐరిస్ ద్వారా సరుకులు అందజేస్తారు. ఇక నుంచి ఐరిస్‌తోనే.. ప్రజా పంపిణీలో ఐరిస్ విధానం మే నెల నుంచి అమలు కానుంది. ఇందుకు సంబంధించిన ఐరిస్ మెషిన్లు జిల్లాకు వచ్చాయి. వీటిని త్వరలో డీలర్లకు అందజేసి వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తాం. వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఈ విధానం ద్వారా, ఇకపై వీఆర్వో సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా సరుకులు పొందవచ్చు. ప్రజా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. – కృష్ణప్రసాద్, డీఎస్వో -
ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు
-
ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు
మాడ్రిడ్: ఓ యువకుడు ఏకంగా ప్రధానమంత్రిపై దాడిచేసి ఆయన ముఖంపై పంచ్ విసిరాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కళ్లద్దాలను విరగొట్టేశాడు. ఈ ఘటన స్పెయిన్ లోని పాంటేవేద్రాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్ పెంటేవేద్రా అనే పట్టణంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆండ్రీస్ డెల్ వీ అనే ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అన్నట్లుగా ప్రధాని దగ్గరికి వచ్చాడు. కుడి చేతిలో ముబైల్ పట్టుకుని సెల్ఫీ కోసం ప్రధానికి దగ్గరికి వచ్చాక, ఆ యువకుడు తన ఎడమ చేతితో ప్రధాని రాజోయ్ ముఖంపై ఓ పంచ్ విసిరాడు. ప్రధానిపై దాడికి పాల్పడటంతో పాటు ఆయన కళ్లద్దాలను విరగొట్టాడు. ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రధానిని ఓ అధికారి కారులో అక్కడి నుంచి లా కరునా నగరానికి తీసుకెళ్లారు. ఈ అనూహ్య సంఘటనకు పార్టీ మంత్రులు, నేతలు షాక్ తిన్నారు. ఆ యువకుడు ప్రధానిని కొట్టడంపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు, మాటలు రావట్లేదని పబ్లిక్ వర్క్స్ మంత్రి అనా పాస్టర్ అన్నారు. స్పానిష్ సోషలిస్ట్ పార్టీ నేతలందరి తరఫున ప్రధాని రాజోయ్కు ఆ పార్టీ నేత పెడ్రో సాంచెజ్ తన సంఘీభావాన్ని తెలిపారు. అరెస్టు చేసిన యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. ప్రధానిని కొట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ యువకుడు సమాధానమివ్వడంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.


