షుగర్, మధుమేహం, డయాబిటిస్.. ఇలా పేరు ఏదైనా కావచ్చు ఇదో దీర్ఘకాల సమస్య. దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయం కాదు. నియంత్రణలో ఉంచుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం, మానని పుండ్లు, వేళ్లు, పాదాలు, కాళ్లు తీసేయాల్సిన రావటం.. చూపు పోవటం, కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయి. ఆపై మరణం ముప్పూ పెరుగుతుంది. దీంతో ఈ జబ్బు గురించి అందరికీ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుతారు. మధుమేహంతో బాధ పడుతున్న సినీ సెలబ్రిటీలు దానిని ఎలా కంట్రోల్‌లో ఉంచారో తెలుసుకుందాం.
కమల్ హాసన్- మధుమేహం
కమల్ హాసన్ టైప్ 1 డయాబెటిస్ యోధుడని చెప్పాలి. తన బాల్యం నుంచి పడుతున్నారు. అతి దాహం, అతి మూత్రం, చిరాకు, అనారోగ్య సమస్యలు..ఈ జబ్బుతో ఎన్ని బాధలో. వాటన్నింటినీ అనుభవిస్తూనే అత్యుత్తమ నటన ఇస్తున్నారు. ఒకసారి తన పరిస్థితి గురించి మాట్లాడుతూ.. డయాబెటిస్ అనేది కేవలం జీవక్రియ రుగ్మత అని తెలిపారు. దానిని జయించవచ్చని తెలిపారు. అందుకోసం క్రమంతప్పకుండా జిమ్‌లో చేసే వ్యాయామాలు ఉపయోగపడ్డాయన్నారు. మద్యపానాన్ని పూర్తిగా మానేయడం వల్ల మధుమేహంతో పోరాటంలో విజయం సాధించగలిగానని చెప్పారు. డయాబెటిస్ వల్ల తన కెరీర్, లుక్స్ మొత్తం జీవితంపై ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. కమల్ హాసన్ యోగా కూడా చేస్తారు. వ్యాయామంతో పాటు వైద్యల సూచన మేరకు డైట్ ఫాలో కావడంతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేసుకున్నారు.
కొన్ని నాలో కూడా కనిపించాయి: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ఫిట్‌గా ఉంటారు. ఎప్పుడూ జిమ్‌లోనే గడిపేస్తారు. అయితే, ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారిలో సర్వసాధారణంగా కనిపించే కొన్ని సమస్యలు తనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఆమె గమనించారు. అయితే, ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆహారంలో మరిన్ని మార్పులు చేసుకున్నాని పంచకున్నారు. సమంతకు 2022లో మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా ఆమె కఠినమైన డైట్ పాటించి విజయం సాధించారు.
13 ఏళ్ల వయసు నుంచే డయాబెటిస్: నిక్ జోనస్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్‌కు 13 ఏళ్ల వయసులో డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సింగర్, నటుడిగా ప్రసిద్ధి చెందిన నిక్ జోనస్ తనకున్న షుగర్ వ్యాధి గురించి బహిరంగంగానే చెప్పారు. 13 ఏళ్ల వయసులో టైప్ 1 డయాబెటిస్ నిర్ధరణ అయిన తర్వాత ఎవరో తన కలలపై తలుపులు మూసినట్లు అనిపించిందని ఆయన బాధపడ్డారు. కానీ, పూర్తి వ్యాయామంతో పాటు వైద్యుల సూచించిన డైట్ ఫాలో కావడంతో సులువుగా జయించానన్నారు.
టైప్-1 డయాబెటిస్: సోనమ్ కపూర్
నేటి ఫ్యాషన్ ఐకాన్‌లలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఒకరు.. ఆమె కూడా టైప్ 1 డయాబెటిస్ బారిన పడింది. తనకు 17 ఏళ్ళ వయసులో నిర్ధారణ అయింది. టైప్ 1 డయాబెటిస్‌తో పాటు, సోనమ్‌కు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ (పిసిఓడి) కూడా ఉంది. దీంతో కెరీర్, ఆరోగ్యం మధ్య సమతుల్యత విషయంలో విజయం సాధించింది. సోనమ్ కపూర్ తన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో డయాబెటిస్‌ను అధిగమించగలిగింది. ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కు వెళ్లడం కంటే ఈత కొట్టడం వంటి శారీరక శ్రమలను ఆమె ఇష్టపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆమె తన అభిమానులకు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంది.


