ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి | 10 Lost Breath As Oxygen Cylinder Explodes At Pakistan | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి 10 మంది మృతి

Oct 29 2026 9:02 PM | Updated on Oct 29 2026 9:02 PM

10 Lost Breath As Oxygen Cylinder Explodes At Pakistan

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిలిచి ఉన్న ఓ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోగులు, వైద్య సిబ్బంది, వారి బంధువులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

సింధ్‌ ప్రావిన్స్‌లోని థార్‌పార్కర్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోగులను మరో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌లో పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. పేలుడు ధాటికి అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పారదర్శకంగా దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను బలోపేతం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం ఉందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement