దుబాయ్‌కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ కంపెనీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన టాప్ ఎంప్లాయ్‌కి ఏకంగా లంబోర్గిని ఉరుస్ (Lamborghini Urus) కారును బహుమతిగా ఇవ్వడం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం పదండి!
రిచ్‌కీ ప్రాపర్టీస్ (Richkey Properties) వ్యవస్థాపకుడు సీఈఓ దాబన్ ఓత్మాన్ (Daban Othman). రెండేళ్లలో 500 మిలియన్ డాలర్లకు పైగా అమ్మకాలను పూర్తి చేసిన రియల్ ఎస్టేట్ సూపర్ ఏజెంట్ నటాలియా చావెజ్ (Natalia Chavez)కు ఈ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చారు. కేవలం ఒక అవార్డును మాత్రమే ఆశించిన చావెజ్‌ను ఓత్మాన్ ఈ సర్‌ప్రైజ్‌తో ఉబ్బితబ్బిబ్బైపోయింది.
"> కంపెనీ మూడోవార్షికోత్సవ గాలా, అవార్డుల ప్రదానోత్సవంలో రిచ్‌కీ ప్రాపర్టీస్ కంపెనీలో రియల్ ఎస్టేట్ సూపర్ ఏజెంట్ నటాలియాకు ఈ కారును బహుకరించారు. 'టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ 2026'గా ప్రకటించి, కంపెనీ సీఈఓ చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. ఆమె అవార్డు తీసుకుని తిరిగి తన సీటు వద్దకు వెళ్తుండగా సీఈఓ దాబన్ ఒత్మాన్ ఆపి, "ఇక్కడితో ముగిసిపోలేదు, మీకు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది" అని చెప్పారు. ఆ తరువాత కౌంట్‌డౌన్ వేసి, రిబ్బన్ కట్ చేసి ఒక బ్లూ కలర్ లంబోర్గిని కారును ఆమెకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందించారు. ఈ వేడుకలో ఆమె మొత్తం 4 ప్రధాన అవార్డులతో పాటు ఈ లగ్జరీ కారును గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: 15 అడుగుల గోతిలో 3 బ్లూ డమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు
నటాలియా గత రెండేళ్లలో దాదాపు 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,100 కోట్లు) పైగా రియల్ ఎస్టేట్ విక్రయాలు జరిపి రికార్డు సృష్టించింది.దుబాయ్‌లో లంబోర్గిని ఉరుస్ కారు ధర 9 లక్షల AED నుండి 15.5 లక్షల AED వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2.3 కోట్ల నుండి రూ. 4 కోట్లు ఉంటుంది.
ఇదీ చదవండి: షాకిచ్చిన కర్ణాటక : లీటరు పాల ధర రూ. 8 పెంపు


