దుబాయ్‌లో ప్రారంభం కానున్న గోల్డ్ వాక్‌వే (ప్రతీకాత్మక చిత్రం)
పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుండే దుబాయ్.. మరో కొత్త ఆకర్షణకు సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో నడకదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది 2026 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ భావిస్తోంది.
బంగారంతో ఏర్పాటు చేసిన నడకదారి అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే మొదటిది, అత్యంత పొడవైన బంగారు నడకదారిగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ కమర్షియల్ విభాగం సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హర్మౌది వెల్లడించిన వివరాల ప్రకారం.. మరో రెండు నెలల్లోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన దుబాయ్.. ఇప్పుడు బంగారంతోనే పర్యాటకులను ఆకర్షించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నడకదారి సందర్శకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు, అంతర్జాతీయ బంగారు వ్యాపార కేంద్రంగా దుబాయ్‌కు ఉన్న గుర్తింపును మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జోయాలుక్కాస్ జ్యువెలరీ రూపొందించిన సంప్రదాయ భారతీయ జుంకా చెవిపోగులు కూడా ఇటీవల రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాయి. ప్రపంచంలోనే అత్యంత బరువైన జత బంగారు చెవిపోగులు, అతిపెద్ద జత చెవిపోగులుగా అవి గుర్తింపు పొందాయి.
ఇదీ చదవండి: పెట్రోల్‌కు చెక్ పెట్టే E100.. వాహనదారులకు కీలక అప్‌డేట్!


