షమీకి సహచరుల అభినందన
కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 496/5
అస్సాంపై 361 పరుగుల ఆధిక్యం
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్
గువాహటి: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టు రెండో విజయానికి చేరువైంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని ‘డ్రా’ చేసుకున్న మాజీ చాంపియన్ కర్ణాటక... తాజాగా అస్సాంతో పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తోంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 117 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 496 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 180/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. అస్సాం బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కర్ణాటక బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు.
కేవీ అనీశ్ (248 బంతుల్లో 142 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా... అనీశ్వర్ గౌతమ్ (125 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (121 బంతుల్లో 72; 10 ఫోర్లు), మన్వంత్ కుమార్ (63 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించారు. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (21) ప్రభావం చూపలేకపోయాడు.

సహచరుల అండతో అనీశ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అభేద్యమైన ఆరో వికెట్‌కు మన్వంత్‌తో కలిసి అనీశ్ 95 పరుగులు జోడించాడు. అస్సాం బౌలర్లలో అమలన్‌జ్యోతి దాస్, రోషన్ ఆలమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ప్రస్తుతం కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనీశ్‌తో పాటు మన్వంత్ క్రీజులో ఉన్నాడు.
షమీ, షహబాజ్‌కు మూడేసి వికెట్లు
ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ బౌలర్లు సత్తాచాటారు. టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ షమీ (3/36), షహబాజ్ అహ్మద్ (3/34) ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. తనయ్ సాంఘ్వీ (167 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో మెరిశాడు.
టాపార్డర్ విఫలమవడంతో ఒక దశలో 64/6తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును చివరి వరుస బ్యాటర్ల అండతో తనయ్ ఆదుకున్నాడు. సౌరభ్ నవాలె (28), రాజ్‌వర్ధనన్ హంగారెగేకర్ (24), ప్రదీప్ (22 బ్యాటింగ్) తలాకొన్ని పరుగులు చేశారు. అంతకుముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మహారాష్ట్ర జట్టు ప్రస్తుతం 64 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండు రోజుల ఆట మిగిలిఉండగా... తనయ్‌తో పాటు ప్రదీప్ క్రీజులో ఉన్నాడు.
అక్షయ్ వాడ్కర్ సెంచరీ
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో విదర్భ కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (212 బంతుల్లో 100; 9 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ కాగా... ఓవర్‌నైట్ స్కోరు 56/4తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు 334 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే (111 బంతుల్లో 97; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి ఒక దశలో 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును నచికేత్‌తో కలిసి అక్షయ్ ఆదుకున్నాడు. దీంతో విదర్భ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సెంచరీ అనంతరం అక్షయ్ రిటైర్ట్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.
మధ్యప్రదేశ్ బౌలర్లలో సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్ జట్టు... విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 106 పరుగులు వెనుకబడి ఉంది. యశ్ దూబే (4) అవుట్ కాగా... సక్ష్యం పురోహిత్ (14 బ్యాటింగ్), అథర్వ మహాజన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
సాన్వీర్ డబుల్ సెంచరీ
పంజాబ్ 592/9 డిక్లేర్
ఆంధ్రతో రంజీ మ్యాచ్
చండీగఢ్: మిడిలార్డర్ బ్యాటర్ సానీ్వర్ సింగ్ (205; 22 ఫోర్లు, 1 సిక్స్) ‘డబుల్ సెంచరీ’తో చెలరేగడంతో ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 276/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ 156 ఓవర్లలో 592/9 వద్ద డిక్లేర్ చేసింది. సలీల్ అరోరా (144; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇమన్‌జ్యోత్ సింగ్ (122; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ 3 వికెట్లు పడగొట్టగా... నరసింహరాజు, విజయ్, సౌరభ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (16 బ్యాటింగ్), రేవంత్ రెడ్డి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ 275/9
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు... జింఖానా వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 10 పరుగుల దూరంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90.1 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా... మంగళవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.
రాహుల్ రాధేశ్ (174 బంతుల్లో 72; 4 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... హిమతేజ (46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిరథ్ రెడ్డి (35; 3 ఫోర్లు), అనికేత్ రెడ్డి (32; 5 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (29 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ధర్మేంద్రసింగ్ జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 9 పరుగుల దూరంలో ఉంది. తనయ్ త్యాగరాజన్‌తో పాటు రక్షణ్ రెడ్డి (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
ఎలైట్ గ్రూప్ ‘ఎ’
బరోడా తొలి ఇన్నింగ్స్: 355 (ధ్రువ్ పటేల్ 124; కార్తీక్ యాదవ్ 5/104),
ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 196/0 (ఆదర్శ్ సింగ్ 96 బ్యాటింగ్, మాధవ్ కౌషిక్ 90 బ్యాటింగ్).
గోవా తొలి ఇన్నింగ్స్: 397 (స్నేహల్ కౌథాంకర్ 178 నాటౌట్; సూరజ్ కశ్యప్ 5/90), బీహార్ తొలి ఇన్నింగ్స్: 107 ఆలౌట్ (మంగళ్ మహ్రోర్ 25; వాసుకి కౌశిక్ 3/12), బిహార్ రెండో ఇన్నింగ్స్: 63/3 (ఆయుశ్ 47; లలిత్ 2/17).
పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: 385 (మోహిత్ కాలె 73; సాగర్ త్రివేది 65; సునీల్ కుమార్ 6/98), జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 149/0 (శుభమ్ ఖజురియా 80 బ్యాటింగ్; ఖమ్రాన్ ఇక్బాల్ 68 బ్యాటింగ్).
ఎలైట్ గ్రూప్ ‘బి’
త్రిపుర తొలి ఇన్నింగ్స్: 268; సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 118 (అర్పిత్ 38; పర్వేజ్ సుల్తాన్ 5/25); త్రిపుర రెండో ఇన్నింగ్స్: 54/4.
ఎలైట్ గ్రూప్ ‘సి’
జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 258/5 (ఆదిత్య సింగ్ 94 బ్యాటింగ్, అనుకూల్ రాయ్ 89; రాజేశ్ మొహంతి 2/30); ఒడిశాతో మ్యాచ్.
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 534/9 డిక్లేర్డ్ (ఉర్విల్ పటేల్ 210 నాటౌట్; బాసిల్ 3/80), కేరళ తొలి ఇన్నింగ్స్: 74/3 (విష్ణు వినోద్ 21 బ్యాటింగ్; అర్జాన్ 2/24).
సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్: 266 (రజత్ పలివాల్ 111 నాటౌట్; అమన్ 4/79), ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 299/6 (సుమిత్ మాథుర్ 80 బ్యాటింగ్; ఆయుశ్ దొసేజా 78; అర్జున్ శర్మ 2/48).
ఎలైట్ గ్రూప్ ‘డి’
హరియాణా తొలి ఇన్నింగ్స్: 153; ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: 296/7 (డేగ నిశ్చల్ 148; కని‹Ù్క చౌహాన్ 4/55).
రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: 78 ఆలౌట్; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 153 (అంకుశ్ బైన్స్ 56; సాహిల్ 5/50), రాజస్తాన్ రెండో ఇన్నింగ్స్: 297/4 (రోహన్ 140, మహిపాల్ లోమ్రర్ 97; అభిషేక్ కుమార్ 2/77).
ముంబై తొలి ఇన్నింగ్స్: 396 (షమ్స్ ములానీ 71, అంగ్‌క్రిష్ రఘువంశీ 78; హిమాన్షు 4/88), రైల్వేస్ తొలి ఇన్నింగ్స్: 116/2 (వివేక్ సింగ్ 38; తనుశ్ కొటియాన్ 1/12).
తమిళనాడు తొలి ఇన్నింగ్స్: 571/7 డిక్లేర్ (ప్రదోశ్ రంజన్ పాల్ 208; అజిత్ రామ్ 115 నాటౌట్; భాగ్మెందర్ లాథర్ 2/102), చండీగఢ్ తొలి ఇన్నింగ్స్: 49/3 (అర్జున్ 21; సాయి కిషోర్ 2/14).


