source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అతడు ఇప్పటికే యాజమాన్యానికి కూడా తెలియజేసినట్లు సమాచారం.
పనిభారం తగ్గించుకునేందుకే హెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన జాతీయ జట్టు (ఆస్ట్రేలియా) తరఫున అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2027కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై హెడ్ లేదా సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌లో చేరిన హెడ్.. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి అతడు నెలకొల్పిన విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యాలు ప్రత్యర్థి బౌలర్లకు పీడకలలుగా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఒకవేళ హెడ్ నిజంగానే వచ్చే సీజన్‌కు దూరమైతే ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి.
హెడ్‌కు ప్రత్యామ్నాయం వెతకడం సవాలే..!
గత మూడు ఐపీఎల్ సీజన్లుగా సన్‌రైజర్స్ టాపార్డర్‌లో హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించడంలో హెడ్ కీలకంగా మారాడు. ఒకవేళ హెడ్ వచ్చే సీజన్‌కు అందుబాటులో లేకపోతే అతడికి సరైన ప్రత్యామ్నాయాన్ని వెతకడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద సవాలుగా మారుతుంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్..!


