breaking news
shanghai cooperation organization
-
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. రాష్ట్రపతి ముర్మును కలుసుకున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. చైనాలోని తియాంజిన్‌లో ఆగస్ట్ 31 నుంచి సెపె్టంబర్ ఒకటో తేదీ వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు ఆయన జపాన్‌లో పర్యటించారు. 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశమైనట్లు భావిస్తున్నారు. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్‌లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్‌ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్‌లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్‌లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్‌పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్‌పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్‌తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్‌లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్‌ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
భద్రత, శాంతితోనే అభివృద్ధి
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్‌లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు. కాలం చెల్లిన విధానాలు వద్దు ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు. ముష్కరులను పోషించడం మానుకోవాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు. అల్‌ఖైదా, అని అనుబంధ గ్రూప్‌లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్‌పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ
తియాంజిన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం, సానుభూతి ప్రకటించారు. ఈ హేయమైన ఘటనకు కారణమైన ముష్కరులను, వారి పోషకులను, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘాతుకాలను సహించడానికి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నామని వారు ఉద్ఘాటించారు. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారు. అలాంటి శక్తులను స్వలాభం కోసం ఎవరూ వాడుకోకుండా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. బెల్డ్ అండ్ రోడ్‌ను తప్పుపట్టిన మోదీ చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ కార్యక్రమం(బీఆర్ఐ) పట్ల ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే నమ్మకం, విశ్వసనీయత పెంచుకొనేలా ఉండాలి తప్ప తగ్గించుకొనేలా ఉండొద్దన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ను అనుసంధానిస్తూ బీఆర్ఐని చైనా ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గుండానే వెళ్తోంది. దీన్ని భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
బంధం బలోపేతమే లక్ష్యం
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్‌పింగ్‌తో మోదీ అన్నారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్‌ల భారం మోపిన వేళ ఎస్సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్‌పార్టీ పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్క్వీని కలిశారు. జిన్‌పింగ్‌తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్క్వీని మోదీ కోరారు. ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు. వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్‌పింగ్‌ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్పింగ్తియాంజిన్లో మోదీ, జిన్‌పింగ్ కరచాలనం ట్రంప్‌కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్‌ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి. చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు. దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్‌పింగ్ అన్నారు.గ్రూప్ ఫొటోలో జిన్‌పింగ్, పుతిన్ పక్కపక్కనే ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్‌పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్‌పింగ్‌కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్‌స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి. జిన్‌పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్‌క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్‌పింగ్‌కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్‌పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్‌ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్‌లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్‌ప్లేట్‌ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. జిన్‌పింగ్ నోట పంచశీల మాట భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్‌పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్‌పింగ్ అన్నారు. ఏమిటీ పంచశీల ఒప్పందం? 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి.. 1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం 2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం 3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం 4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం 5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడంఆంక్షలపై పోరాడుతాం: పుతిన్ ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు. మోదీ, జిన్‌పింగ్ భేటీ ‘పది’నిసలు → రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్‌పింగ్‌లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు → భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు → కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది → పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు → సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు → భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్‌పింగ్ అభిలషించారు → ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు → చైనా కంపెనీలకు భారత్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్‌లో విద్యుత్వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు → ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించారు → అధిక టారిఫ్‌లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
పుతిన్, మోదీలకు జిన్‌పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్‌పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు. బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్‌పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్‌ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు. ఎస్సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్రమణి రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్రమణి విశ్లేషించారు. 2001లో ఎస్సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం. -
ప్రధాని మోదీని స్వాగతించిన చైనా
బీజింగ్: ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న, వచ్చే నెల 1న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సుకు నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సదస్సు భాగస్వామ్యపక్షాలకు స్నేహపూర్వక, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశాలతోపాటు మొత్తం 20 దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజ్‌నాథ్ నిర్ణయం సరైందే: జైశంకర్
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉండాలని భారత్ కోరుకుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చెప్పారు. కానీ, ఒకే ఒక్క సభ్య దేశానికి అది ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటమనే ప్రధాన లక్ష్యంతో ఎస్సీవో రక్షణ మంత్రులు చైనాలో సమావేశమయ్యారని గుర్తు చేసిన జై శంకర్..ఆ ప్రస్తావనే లేకుండా రూపకల్పన చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. శుక్రవారం మంత్రి జై శంకర్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని, సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఆజ్యపోయడంపై భారత్ ఆందోళనను పట్టించుకోకుండా తయారు చేసిన ప్రకటనపై భారత్ సంతకం చేయని విషయం తెల్సిందే. పైపెచ్చు, ఆ ప్రకటనలో భారత్ ప్రోద్బలంతో బలూచిస్తాన్‌లో భారత్ ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తోందంటూ పాకిసాŠత్న్ ఒక పేరాను కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. -
చైనా తీరు మారాలి!
ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్‌స్తాన్‌లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు. ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి. వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్‌గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది. అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్‌ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్సీఓలో బీఆర్‌ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.ఆ సంగతలావుంచి ఎస్సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్‌లో 60 గ్రామాలు నిర్మిస్తోంది. మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్‌ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ సమస్యపై భారత్‌తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసీ మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు. పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్‌ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి. -
SCO Summit: ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలొద్దు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు. స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది. ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్ బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు. -
ఎస్సీవో వర్చువల్ భేటీకి జిన్‌పింగ్
బీజింగ్: భారత్ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన వర్చువల్‌గా జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) శిఖరాగ్ర భేటీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని డ్రాగన్ దేశం చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహా్వనం మేరకు ఎస్సీవో 23వ ప్రభుత్వాధినేతల సమావేశానికి జిన్‌పింగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 2001లో ఏర్పాటైన ఎస్సీవోలో భారత్, పాక్‌లు 2017లో శాశ్వత సభ్యదేశాలయ్యాయి. రొటేషన్ విధానంలో భారత్‌కు ఈ ఏడాది అధ్యక్ష స్థానం దక్కింది. -
సరిహద్దు సమస్యల పరిష్కారానికే పెద్ద పీట
గోవా: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్‌తో బెనౌలిమ్ బీచ్ రిసార్ట్‌లో జై శంకర్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్యతో పాటు ఎస్సీఒ, జీ–20, బ్రిక్స్‌కు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎస్సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు. -
SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు. కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్ శాశ్వత సభ్యదేశంగా మారింది. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
9 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్న పాక్ మంత్రి.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనకు రానున్నారు. భారత్‌లో మే నెలలో జరగబోయే షాంఘై సహాకార సంస్థ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాగా చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటించగా.. ఈ తరువాత పాకిస్థాన్ నుంచి భారత్‌లో అడుగుపెట్టే మొదటి నేత బిలావల్ భుట్టోనే కానుండటం విశేషం భారత్ అధ్యక్షతన ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా విదేశీ వ్యవహరాల మంత్రుల సమావేశం మే 4,5 తేదీల్లో గోవాలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో బిలావల్ భుట్టో పాల్గొననున్నారు. ఆయనతోపాటు గ్రూప్‌లోని వివిధ దేశాల విదేశాంగ మంత్రుల ప్రతినిధుల బృందం కూడా సమావేశానికి హాజరుకానుంది. కాగా షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు(చైనా, రష్యా, భారత్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్‌లు) ఉన్నాయి. 2017 జూన్9న శాశ్వత దేశంగా సభ్యత్వం పొందింది. సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలోలో 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. చదవండి: Mount Annapurna: అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడి ఆచూకీ లభ్యం -
SCO Summit 2022: యుద్ధాన్ని ముగించండి
సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. ఎస్ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు. గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. -
Shanghai Cooperation Organisation: అనుసంధానమే బలం
సమర్ఖండ్: షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో శుక్రవారం ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్ ‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు. ప్రపంచానికి భారత్ గమ్యస్థానం మెడికల్, వెల్నెస్ టూరిజంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు. ఇక భారత్ సారథ్యం రొటేషన్ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్ చేతికి వచ్చింది. 2023లో ఎన్సీఓ శిఖరాగ్రానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకట్ మిర్జియోయెవ్ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు. పలకరింపుల్లేవ్.. కరచాలనాల్లేవ్ న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో ఎస్సీవో సదస్సుకు హాజరైన భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. శుక్రవారం ఒకే వేదికపైన ఫొటోల కోసం మిగతా నేతలతో కలిసి పక్కపక్కనే నిలబడిన సమయంలోనూ ఒకరినొకరు పట్టనట్లుగా వ్యవహరించారు. చిరునవ్వుతో పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. గల్వాన్ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం తెలిసిందే. అప్పటినుంచి వారు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. అమెరికాపై జిన్‌పింగ్ విమర్శలు ‘‘కొన్ని శక్తులు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం, ఏకపక్ష పోకడలు ప్రదర్శిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను విచ్ఛిన్నం చేయజూస్తున్నాయి’’ అని అమెరికానుద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమర్శలు గుప్పించారు. వాటిపట్ల ఎస్సీఓ సభ్యదేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రక్షణ సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం సభ్య దేశాలకు చెందిన 2,000 మంది సైనిక సిబ్బందికి చైనాలో శిక్షణ ఇస్తాం. ఉమ్మడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకుందాం’’ అంటూ ప్రతిపాదించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు తదితరాల కోసం వర్ధమాన దేశాలకు 105 కోట్ల డాలర్ల మేరకు సాయం అందిస్తామని ప్రకటించారు. -
‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాలకు మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్లైన్లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. -
దురాక్రమణ దుస్సాహసం
మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్‌ఘీ సమక్షంలోనే రాజ్‌నాథ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‌లోని భారత్ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఎస్సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు. ఎస్సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్‌ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది. శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ‘రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్ పరిస్థితిపై ఆందోళన అఫ్గానిస్తాన్‌లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ఆ దేశాలే బాధ్యులు
బిష్కెక్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు. ఎస్సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్ కీలకమని భారత ప్రధాని అన్నారు. ఆప్ఘన్ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ–ఇమ్రాన్ పలకరింపులు ఎస్సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది. దౌత్య మర్యాదకు ఇమ్రాన్ భంగం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్ అయింది.ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికార ట్విట్టర్లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్ ఖాన్ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
పాక్‌కు బుద్ధిచెప్పండి
బిష్కెక్/వాషింగ్టన్: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు‡ పుతిన్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మోదీ స్పందిస్తూ.. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ‘భారత్–చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఈ భేటీలో చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రమూకలపై పాక్ కఠినచర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఉగ్రరహిత వాతావరణంలో పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మోదీని జిన్‌పింగ్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని.. జూన్ 15న 66వ పుట్టినరోజు జరుపుకోనున్న జిన్‌పింగ్‌కు భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఎస్సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్లో ఎస్సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది. మోదీ సరికొత్త నాయకుడు: పాంపియో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సులో పాంపియో మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుపొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సరికొత్త నాయకుడిగా మోదీ అవతరించారు’ అని కితాబిచ్చారు. భారత యువతకు సుసంపన్నమైన, ఉజ్వల భవిష్యత్తును మోదీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లతో పాటు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సాయమందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి 30 వరకూ పాంపియో భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించనున్నారు. -
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది 2001లో ఏర్పడింది. దీంట్లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది మొదట 1996లో ‘షాంఘై ఫైవ్’గా ఏర్పాటైంది. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరడంతో షాంఘై సహకార సంస్థగా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ రష్యాకు చెందిన డిమిత్రి మెజెంత్సెవ్. ఈ సంస్థకు భారత్, అఫ్గానిస్థాన్, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం సభ్యదేశాలను ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం నుంచి కాపాడటం. 13వ శిఖరాగ్ర సదస్సు:షాంఘై సహకార సంస్థ 13వ శిఖరాగ్ర సదస్సు 2014, సెప్టెంబర్ 11,12న తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో జరిగింది. సదస్సుకు హాజరైన దేశాధినేతలు: ఇమోమలీ రహమాన్ తజికిస్థాన్ జీ జిన్‌పింగ్ చైనా వ్లాదిమిర్ పుతిన్ రష్యా నుర్‌సుల్తాన్ నజర్బయేవ్ కజకిస్థాన్ అల్మాజ్బెక్ అతంబయేవ్ కిర్గిజిస్థాన్ ఇస్లామ్ కరిమోవ్ - ఉజ్బెకిస్థాన్ ఈ సదస్సుకు భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఎస్సీవో 14వ శిఖరాగ్ర సదస్సు 2015, జూలై 9,10న రష్యాలోని ఉఫా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించే అవకాశముంది. ఈ సమావేశాన్ని ఏడో బ్రిక్స్ సదస్సుతోపాటు నిర్వహించనున్నారు.