
బీజింగ్: ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న, వచ్చే నెల 1న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సుకు నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ శుక్రవారం పేర్కొన్నారు.
ఈ సదస్సు భాగస్వామ్యపక్షాలకు స్నేహపూర్వక, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశాలతోపాటు మొత్తం 20 దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు.