
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. రాష్ట్రపతి ముర్మును కలుసుకున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. చైనాలోని తియాంజిన్‌లో ఆగస్ట్ 31 నుంచి సెపె్టంబర్ ఒకటో తేదీ వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు ఆయన జపాన్‌లో పర్యటించారు. 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశమైనట్లు భావిస్తున్నారు.