రాజ్‌నాథ్‌ నిర్ణయం సరైందే: జైశంకర్‌ | SCO statement without terrorism reference unacceptable to India | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ నిర్ణయం సరైందే: జైశంకర్‌

Jun 28 2025 5:10 AM | Updated on Jun 28 2025 5:10 AM

SCO statement without terrorism reference unacceptable to India

న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉండాలని భారత్‌ కోరుకుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ చెప్పారు. కానీ, ఒకే ఒక్క సభ్య దేశానికి అది ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

ఉగ్రవాదంపై పోరాటమనే ప్రధాన లక్ష్యంతో ఎస్‌సీవో రక్షణ మంత్రులు చైనాలో సమావేశమయ్యారని గుర్తు చేసిన జై శంకర్‌..ఆ ప్రస్తావనే లేకుండా రూపకల్పన చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

 శుక్రవారం మంత్రి జై శంకర్‌ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని, సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ ఆజ్యపోయడంపై భారత్‌ ఆందోళనను పట్టించుకోకుండా తయారు చేసిన ప్రకటనపై భారత్‌ సంతకం చేయని విషయం తెల్సిందే. పైపెచ్చు, ఆ ప్రకటనలో భారత్‌ ప్రోద్బలంతో బలూచిస్తాన్‌లో భారత్‌ ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తోందంటూ పాకిసాŠత్న్‌ ఒక పేరాను కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. 
 

Advertisement
 
Advertisement
Advertisement