breaking news
joint statement
-
మధ్యంతర ఒప్పందానికి సై
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు తీపి కబురు అందింది. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. మధ్యంతర ఒప్పందంలో భాగంగా వాటిని 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు గత ఏడాది ఆగస్టులో విధించిన 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 25 శాతం అదనపు సుంకాలను శనివారం నుంచే రద్దు చేస్తున్నట్లు అమెరికా తేలి్చచెప్పింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను భారత్ కొంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉంటామని భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంతకాలు! ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగినట్లు ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు పేర్కొన్నాయి. తద్వారా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని, పరిశ్రమలకు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశాయి. ఇది పరస్పరం ఇచి్చపుచ్చుకొనే, ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఒప్పందమని అభివరి్ణంచాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది తొలిదశ అని ఉద్ఘాటించాయి. పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను మరింత వేగవంతం చేస్తామని తెలిపాయి. మధ్యంతర ఒప్పందం వల్ల అమెరికాలో 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ భారత ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేసింది. మధ్యంతర ఒప్పందంపై వచ్చే నెల రెండో వారంలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామని భారత్, అమెరికా ప్రకటించాయి. భారత్, రష్యాల చమురు వాణిజ్యంపై నిఘా అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను రద్దు చేశామని, మరికొన్నింటిపై తగ్గించామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పశువుల దాణాగా ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, మద్యం తయారీలో వాడే ధాన్యాల వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విమాన విడిభాగాలు, అరుదైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటివి దిగుమతి చేసుకోబోతున్నట్లు స్పష్టంచేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగే చమురు కొంటున్నట్లు తేలితే భారత్‌పై మరోసారి 25 శాతం అదనపు సుంకాలు విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు ఉంటాయని కార్యనిర్వాహక ఉత్తర్వులో తేలి్చచెప్పడం గమనార్హం. భారత్, రష్యాల మధ్య చమురు వాణిజ్యంపై నిఘా వేస్తామని అమెరికా సర్కార్ వెల్లడించింది. అతిపెద్ద మార్కెట్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గగ్రీర్ హర్షం వ్యక్తంచేశారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, దానివల్ల తమ పరిశ్రమలు, కారి్మకులకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్‌తో ఈ ఒప్పందం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఇండియాపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు. భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఇక ఊపందుకోనున్నాయి. భారత జనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్‌లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది. మనకు భారీ ప్రయోజనం → 44 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు → కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. మన దేశం నుంచి 44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవని తెలిపారు. సున్నా టారిఫ్‌లు అమలవుతాయని అన్నారు. శనివారం ఒప్పందం ఖరారైన తర్వాత పీయూష్ గోయల్ స్పందించారు. లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. 2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పారదర్శకమైన, సమతూకంతో కూడిన ఒప్పందానికి వచ్చామని స్పష్టంచేశారు. మన జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్ వర్తిస్తుందన్నారు. 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ మనకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. మనదేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని తేలి్చచెప్పారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పీయూష్ గోయల్ వివరించారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు వస్తుందన్నారు. ముఖ్యాంశాలు → భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోతాయి. → భారత ఎగుమతిదారుల కోసం 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్లోకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ), రైతులకు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. → ఎగుమతులు పెరిగితే సహజంగానే పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. దానివల్ల యువతకు, మహిళలకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. → ఎగుమతులపై ఆధారపడిన భారత్‌లోని ముఖ్యమైన రంగాలకు మేలు జరుగుతుంది. → సెక్షన్ 232 కింద విమాన విడిభాగాలపై భారత్‌కు కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆటో విడిభాగాలపై టారిఫ్ రేట్ కోటా అమలు చేస్తామని తెలిపింది. → అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది. → ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్–టారిఫ్ అవరోధాలను, డిజిటల్ ట్రేడ్ అవరోధాలను పరిష్కరించుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. → గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించాయి. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు నో రిలీఫ్ తమ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టలేమని, అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించబోమని భారత్ తేల్చేసింది. అమెరికా నుంచి వచ్చే ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అమెరికా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయాలు, మాంసంపై సుంకాలు యథాతథంగా వసూలు చేస్తామని, మినహాయింపులేవీ ఉండవని పేర్కొంది. భారత్‌లో కోట్లాది మంది రైతులు వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే అవి చౌకగా వచి్చపడే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రైతులు నష్టపోవడం ఖాయం. ఇతర దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో మన రైతులు ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి రంగాలే వెన్నెముక అనడం అతిశయోక్తి కాదు.‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం: మోదీన్యూఢిల్లీ: అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం కావడం తథ్యమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో మనకు నూతన అవకాశాలు వస్తాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతం కోసం వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర ఒప్పందం రెండు దేశాలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. భారత్, అమెరికాల భాగస్వామ్యంలో లోతైన విశ్వాసానికి ఇదొక ప్రతీక అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. సప్లై చెయిన్లకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రపంచానికి సైతం ఆర్థికంగా మేలు జరుగుతుందని మోదీ వివరించారు. మన ప్రజల సాధికారత, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్‌మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్‌కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్‌మ్యాప్‌పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
రాజ్‌నాథ్ నిర్ణయం సరైందే: జైశంకర్
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉండాలని భారత్ కోరుకుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చెప్పారు. కానీ, ఒకే ఒక్క సభ్య దేశానికి అది ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటమనే ప్రధాన లక్ష్యంతో ఎస్సీవో రక్షణ మంత్రులు చైనాలో సమావేశమయ్యారని గుర్తు చేసిన జై శంకర్..ఆ ప్రస్తావనే లేకుండా రూపకల్పన చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. శుక్రవారం మంత్రి జై శంకర్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని, సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఆజ్యపోయడంపై భారత్ ఆందోళనను పట్టించుకోకుండా తయారు చేసిన ప్రకటనపై భారత్ సంతకం చేయని విషయం తెల్సిందే. పైపెచ్చు, ఆ ప్రకటనలో భారత్ ప్రోద్బలంతో బలూచిస్తాన్‌లో భారత్ ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తోందంటూ పాకిసాŠత్న్ ఒక పేరాను కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. -
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్‌లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్‌కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్‌రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
సంయుక్త ప్రకటనలో ఏముందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఒక చారిత్రక ప్రకటన మీద సంతకాలు చేశారు. సమగ్రమైన, లోతైన చర్చలు జరిపి, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న అనంతరం కొరియా ద్వీపంలో శాంతి స్థాపన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపడతామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు. కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ హామీ ఇస్తే, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని కిమ్ మరోసారి గట్టిగా చెప్పారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశారు. ఆ ప్రకటనలో ఉన్న అంశాలు శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడేలా చర్యలకు కట్టుబడి ఉండడం కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం ఏప్రిల్ 27, 2018న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండడం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి. చాలా సంక్షిప్తంగా ఉన్న ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ఇరువురు నేతలు, ఈ సానుకూల దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి విదేశాంగ శాఖ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో చర్చలు జరపడాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో వీరి భేటీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇరువురు అంగీకరించారు. కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్..!! -
కెనడా ప్రధానిపై ట్రంప్ గరం
క్యుబెక్: జీ–7 శిఖరాగ్ర సదస్సు అనంతరం సభ్య దేశాలు విడుదలచేసిన ఉమ్మడి ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆతిథ్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై మండిపడ్డారు. సదస్సు ముగియడానికి ముందే సింగపూర్ బయల్దేరిన ట్రంప్ విమానంలోనే ఉమ్మడి ప్రకటనపై స్పందిం చారు. ట్రూడో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ విలేకర్ల సమావేశంలో ట్రూడో చెప్పినవి అబద్ధాలు. నిజం ఏంటంటే అమెరికా కంపెనీలు, కార్మికులు, వ్యవసాయదారులపై కెనడా విధిస్తున్న టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రకటనను నమ్మొద్దని మా ప్రతినిధులకు చెప్పాను. జీ–7 సమావేశ సమయంలో ఎంతో అణకువ, మర్యాదగా నటించిన ట్రూడో నేను వెళ్లిన తరువాత తనను ఎవరూ భయపెట్టలేరని మీడియా ముందు చెప్పారు’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టారిఫ్‌ల పెంపునకు ట్రంప్ భద్రతను సాకుగా చూపడం.. క్లిష్ట సమయాల్లో అమెరికా మిత్ర దేశాలకు మద్దతుగా నిలిచిన కెనడా మాజీ నాయకులను అవమానించడమేనని జస్టిన్ ట్రూడో మీడియా ముందు వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్లపై ట్రూడో కార్యాలయం స్పందిస్తూ.. తమ ప్రధాని ఇంతకుముందు చెప్పని కొత్త విషయాలు వేటినీ చెప్పలేదని వెల్లడించింది. -
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
-
చైనా ఆధిపత్యానికి భారత్ బ్రేక్?
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు పుల్ల వేయడంతో భారత్-చైనాల మధ్య దౌత్య వాతావరణం వేడిక్కింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధ జైష్-ఈ-మొహమ్మద్(జేఈఎమ్) చీఫ్ మసూద్ అజర్ పై అంతర్జాతీయ నిషేధం విధించాలని యూఎన్ లో భారత్ చేసిన ప్రపోజల్ కూ చైనా ససేమీరా అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తమవేనంటూ ఆధిపత్యాన్ని చెలాయించాలని చైనాకు షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కులు ఉన్నాయని పేర్కొన్న ఇతర ఆసియా దేశాలతో( వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్, బ్రూనై) భారత్ సంబంధాలను బలపర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఈ మేరకు అక్టోబర్ లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం దక్షిణ చైనా సముద్రంపై సంయుక్త ప్రకటన చేయాలని సింగపూర్ ను భారత్ కోరినట్లు తెలిసింది. అయితే అందుకు ఆ దేశం అందుకు ససేమీరా అన్నట్లు సమాచారం. దక్షిణ చైనా సముద్రంపై తమకూ హక్కు ఉందని సింగపూర్ ఎన్నడూ ప్రకటించలేదు. భూభాగాల వివాదాల్లోకి ప్రవేశించడానికి ఆ దేశం అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతంపై హక్కు గురించి జపాన్ తో భారత్ సంయుక్త ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశానంతరం ఈ ప్రకటన వెలువడొచ్చు. వియత్నాంతో కలిసి కూడా భారత్ సంయుక్త ప్రకటన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, సంయుక్త ప్రకటన చేయాలనే మనవిపై జపాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. దక్షిణ చైనా సముద్రంపై భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాలని గత నెలలో జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు చైనా సముద్రంలో చైనా మాటను కాదని జపాన్ శరవేగంగా ఎదుగుతోంది. దీంతో జపాన్-చైనాల మధ్య కూడా దౌత్యపరంగా వాతావరణం వేడెక్కింది. చైనాపై ఎలాగైనా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్న జపాన్ యూఎస్-2ఐ విమానాల ధరను తగ్గించి భారత్ కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న డ్రాగన్ దేశం ఇది మంచి విషయం కాదని వ్యాఖ్యానించింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ జపాన్, వియత్నాంలతో సంబంధాలను బలపర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుండటం శుభపరిణామం. చైనా బాధిత దేశాలైన కొన్ని ఆసియా దేశాలతో రక్షణ, భద్రత అంశాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ యత్నిస్తోంది. జపాన్ కూడా వియత్నాంతో సంబంధాలను బలపర్చునే యత్నాలు చేస్తుండటంతో దక్షిణ చైనా సముద్రం తమదేనన్న చైనా ఆటలు సాగకపోవచ్చు. -
బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు.


