బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్ | Bihar Result Shows No Lesson Learnt from Delhi Fiasco, Say BJP Veterans | Sakshi
Sakshi News home page

బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్

Nov 10 2015 9:03 PM | Updated on Mar 29 2019 9:31 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement