న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆమెకు నివాళులర్పించారు. దేశ రాజకీయ, ఆర్థిక చరిత్రలో ఇందిరా గాంధీ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆమెకు నివాళులు అర్పిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
Paying tribute to former Prime Minister Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2026
1917 నవంబర్ 19న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఇందిరా గాంధీ జన్మించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతుల కుమార్తెగా కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. 1964 ఆగస్టులో రాజ్యసభలో అడుగుపెట్టిన ఆమె.. 1966లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1977 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1980 జనవరిలో తిరిగి అధికారంలోకి వచ్చి 1984లో హత్యకు గురయ్యే వరకు ప్రధానిగా పనిచేశారు.
ఇదీ చదవండి: శబరిమల: వర్చువల్ బుకింగ్స్ ఫుల్.. ఇక స్పాట్ బుకింగ్సే!


