సువిశాల విశ్వంలో ఒక కాంతి దినం ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న నాసా అంతరిక్ష నౌక వాయేజర్-1 భూమికి ఒక సందేశం పంపించింది. ఈ సందేశాన్ని నాసా ఫైట్ కంట్రోలర్లు అందుకున్నారు. క్షేమంగా తన ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిసింది. వాయేజర్-1 నుంచి ఈ సందేశం భూమిని చేరుకోవడానికి సరిగ్గా 24 గంటల సమయం పట్టింది.
కాంతి వేగంతో ప్రయాణించే రేడియో సంకేతం 16 బిలియన్ మైళ్లకు(26 బిలియన్ కిలోమీటర్లకు) పైగా దూరాన్ని అధిగమించడానికి ఒక రోజు పడుతుంది. ‘ఒక శిక్ష నౌక కాంతి దినం దూరం ప్రయాణించడం ఒక అద్వితీయ మైన ఘనత. కానీ, వాయేజర్! అనేది ఒక సుదూర యాత్రికుడి కంటే చాలా ఎక్కువ విలువైనది ‘ అని నాసా హీలియోఫి జిక్స్ విభాగం డైరెక్టర్ జో వెస్ట్‌లేక్ ఒక ప్రకటనలో తెలిపారు.
వాయేజర్-1లో శాస్త్రీయ పరికరాలతో పాటు ఓ ప్రత్యేకమైన వస్తువు కూడా ఉంది. బంగారు పూత పూసిన ఓ రికార్డు డిస్క్‌ను ఈ వ్యోమనౌక తనతో తీసుకెళ్తోంది. అందులో భూమిపై మానవుల పలకరింపులు, సంగీతం, ఫొటోలు, వివిధ శబ్దాలు ఉన్నాయి. భూమికి ఆవల ఎక్కడైనా ఉండే జీవులు భవిష్యత్తులో ఈ వ్యోమనౌకను కనుగొంటే.. మానవ నాగరికత, ఇక్కడ జీవించే జీవుల గురించి తెలుసుకునేలా ఈ సందేశాన్ని రూపొందించారు.
ఈ రికార్డును 'గోల్డెన్ రికార్డ్' అని పిలుస్తారు. 12 అంగుళాల పరిమాణంలో ఉండే ఈ రాగి డిస్క్‌కు బంగారు పూత పూశారు. 1977లో వాయేజర్-1, వాయేజర్-2 ప్రయోగాలకు ముందే ఈ రికార్డులను రెండింటిలోనూ అమర్చారు. అత్యాధునిక గ్రహాంతరవాసులు ఎప్పుడైనా ఈ వ్యోమనౌకలను కనుగొంటే.. ఈ రికార్డు ద్వారా భూమి గురించి, మానవుల గురించి వివరాలు తెలుసుకునే అవకాశముంటుందనే ఆలోచనతో దీనిని రూపొందించారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వాయేజర్-1


