టాటా ట్రస్టులకు హైకోర్టులో చుక్కెదురు  | Bombay High Court Denies Interim Relief In Tata Trusts Challenge To N Chandrasekaran | Sakshi
Sakshi News home page

టాటా ట్రస్టులకు హైకోర్టులో చుక్కెదురు 

Nov 28 2026 5:12 AM | Updated on Nov 28 2026 5:12 AM

Bombay High Court Denies Interim Relief In Tata Trusts Challenge To N Chandrasekaran

నవంబర్‌ 30న యథాప్రకారంగా టాటా సన్స్‌ బోర్డు సమావేశం 
 

ముంబై: టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ పునర్నియామకాన్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన రెండు టాటా ట్రస్టులకు చుక్కెదురైంది. షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 30న టాటా సన్స్‌ బోర్డు సమావేశం యధాప్రకారంగా నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొంది. 

అలాగే రెండు ట్రస్టులు దాఖలు చేసిన పిటీషన్లపై తమ వివరణను దాఖలు చేయాలని టాటా సన్స్, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను 2027 జనవరి 18కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళ్తే, కంపెనీ ఆరి్టకల్స్‌కి విరుద్ధంగా మరో ఐదేళ్ల పాటు టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ నియామకం జరిగిందని టాటా సన్స్‌లో వాటాలున్న సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (ఎస్‌డీటీటీ), ఆర్‌డీ టాటా ట్రస్ట్‌ (ఆర్‌డీటీటీ) నవంబర్‌ 26న బాంబే హైకోర్టులో పిటీషన్లు వేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement