బ్యాంకులకు ఆర్‌బీఐ ఊరట! | RBI Reduces Minimum Daily CRR Maintenance From December 1 | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ఆర్‌బీఐ ఊరట!

Nov 28 2026 7:03 AM | Updated on Nov 28 2026 7:10 AM

RBI Reduces Minimum Daily CRR Maintenance From December 1

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు నిధులు(లిక్విడిటీ) తగ్గడంతో ఆర్‌బీఐ తాజాగా కనీస నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌) నిర్వహణలో 9 శాతం కోత పెట్టింది. దీంతో ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ మెయింటెనెన్స్‌ 90 శాతానికి దిగిరానుంది. 2026 డిసెంబర్‌ 1నుంచి సీఆర్‌ఆర్‌ కోత అమల్లోకిరానుంది.

సీఆర్‌ఆర్‌కు అనుగుణంగా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద డిపాజిట్లలో కొంత మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. అయితే ఈ నిధులపై కేంద్ర బ్యాంకు(ఆర్‌బీఐ) నుంచి ఎలాంటి వడ్డీ లభించదు. ప్రస్తుతం ఇది డిపాజిట్లలో 3 శాతంగా అమలవుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో అధిక లిక్విడిటీకి చెక్‌ పెడుతూ ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ మెయింటెనెన్స్‌ను 90 శాతం నుంచి 99 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

స్థూల ఆర్థిక, లిక్విడిటీ పరిస్థితులను సమీక్షించాక రోజువారీ కనీస సీఆర్‌ఆర్‌ నిర్వహణలో బ్యాంకులకు 9 శాతంమేరకు వెసులుబాటు కల్పించాలంటూ నిర్ణయించినట్లు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో తెలియజేసింది. గత ఐదు నెలల్లో తొలిసారి లిక్విడిటీ లోటుస్థాయికి చేరడంతో సీఆర్‌ఆర్‌ నిర్వహణ తగ్గింపు చర్యలకు కేంద్ర బ్యాంకు తెరతీసింది. జీఎస్‌టీ చెల్లింపులు, విదేశీ మారక మార్కెట్లో ఆర్‌బీఐ చర్యలు బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గుదలకు కారణమైనట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement