ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్‌మెంట్‌ | Love Story Of 75 YrMan Marrying 30 Yr Old Woman In UP | Sakshi
Sakshi News home page

ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్‌మెంట్‌

Oct 15 2026 7:33 PM | Updated on Oct 15 2026 8:00 PM

Love Story Of 75 YrMan Marrying 30 Yr Old Woman In UP

ఆమెకు  30 ఏళ్లు. అతనికి 75 ఏ‍ళ్లు.  ఇద్దరూ  ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు.  ఈ దసరా నవరాత్రి  ఉత్సవాల తరువాత ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు వీరిద్దరూ ఘనంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.  ఇరు కుటుంబాల ఆనందోత్సాహాల మధ్య  జరిగిన  ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన  వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి కాని ప్రసాదుల  గుండెల్లో గునపాలు దించుతున్న ఈ వీరి ప్రేమకథ వివరాలేంటో తెలుసుకుందామా.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌షుగర్ (Ramsugar),30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ (Rani Rajput) త్వరలోనే పెళ్లి పీటలెక్క బోతున్నారు.   దాదాపు 45 ఏళ్ల గ్యాప్‌ ఉన్నా వీరి మధ్య చిగురించిన  ప్రేమ,  పెళ్లి  సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

ఏడాది క్రితం వీరి ఎలా మొదలైందీ అంటే
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే రాణి రాజ్‌పుత్, రామ్‌షుగర్ కుమార్తెను కలవడానికి తరచుగా ఆయన ఇంటికి వెళ్లేది. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. వీరిద్దరికీ నిశ్చితార్థం  కాగా, నవరాత్రుల అనంతరం వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇందులో కుటుంబ సభ్యులు ఆప్తుల సమక్షంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా కనిపించారు.

 

ఇదీ చదవండి: చికాగోలో సామూహిక అత్యాచారం కలకలం : ‘నా టర్న్’ఎపుడు‌ అంటూ రచ్చ?!

నెటిజన్ల రియాక్షన్స్‌
ఈ జంట పెళ్లి వార్త ఎక్స్‌లో వైరలవుతోంది. కొందరు వీరికి శుభాకాంక్షలు తెలుపుతోంటే, "రామ్‌షుగర్ వెర్సస్‌ షుగర్ డాడీ " అంటూ సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు  ప్రేమ గుడ్డిదని ఈ రోజు మరోసారి రుజువైంది భయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. అంతేకాదు,  "యువత పరిస్థితి ఏంటి భయ్యా?" అని ఒకరు,  అసలే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని బాధపడుతోంటే, ఇక మాలాంటి వాళ్ల పరిస్థితేంటి బాబోయ్‌  అని  మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ఇంతకీ ఆ 70 ఏళ్ల పెద్దాయన పేరిట ఉన్న ఆస్తి విలువ ఎంత ఉందో?" అంటూ  ఇంకొకరు చమత్కరించారు. వీరిద్దరి మధ్య ఉన్న భారీ వయస్సు వ్యత్యాసం కారణంగా ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇదీ చదవండి:  జియో అలా పుట్టింది : ఇషా అంబానీ చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement