చత్తీస్‌గఢ్: ఎలామడ్గు సీఆర్పీఎఫ్ శిబిరం సమీపంలో పేలుడు సంభవించింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు సహాయ కమాండెంట్ల పరిస్థితి విషమం ఉంది. గాయపడిన వారిని కొంటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జగదల్పూర్‌కు చెందిన మందుగుండు సాంకేతిక బృందం కొంటా శ్రేణిలో వివిధ శిబిరాలను పరిశీలించడానికి వెళ్లిన క్రమంలో ఇది చోటు చేసుకుంది. సురక్షితంగా కొన్ని బాంబులను నిర్వీర్యం చేసిన తర్వాత అనుకోకుండా అందులో ఒకటి పేలింది.
గాయపడిన వారిని ఏటీటీకి చెందిన ఎఎస్ఐ ఎంకే తివారీ, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ అనీష్ ఖాన్, ఎటిటిటీ జట్టుకు చెందిన ఇన్స్పెక్టర్ అమర్ నాథ్ మిశ్రా, 50వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కుల్దీప్ రాజ్‌గా గుర్తించారు.
ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్!


