తిరుచ్చిలో రూ.8.50 కోట్ల బంగారం పట్టివేత | Gold worth Rs 8.50 crore seized in tamil nadu | Sakshi
Sakshi News home page

తిరుచ్చిలో రూ.8.50 కోట్ల బంగారం పట్టివేత

Nov 23 2026 9:31 AM | Updated on Nov 23 2026 9:31 AM

Gold worth Rs 8.50 crore seized in tamil nadu

సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరం నుంచి చెన్నైకి భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని తిరుచ్చి కస్టమ్స్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆదివారం స్వాదీనం చేసుకున్నారు. రామేశ్వరం తీర ప్రాంతం నుంచి కారులో చెన్నైకి బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని తిరుచ్చి డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. 

దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమయపురం టోల్‌ ప్లాజా వద్ద నిఘా ఉంచి, 7.50 కిలోల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.8.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారంతో పాటు కారును సీజ్‌ చేసిన అధికారులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement