భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్‌! | Starlink Spent 5 Years Complying With All Laws In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్‌!

Oct 8 2026 9:35 PM | Updated on Oct 8 2026 9:40 PM

Starlink Spent 5 Years Complying With All Laws In India

సాక్షి,న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ భారత్‌లో తన సేవలను ప్రారంభించేందుకు గత ఐదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అనేక నియంత్రణ సవాళ్లు, భద్రతా నిబంధనలు, వివాదాలను దాటుకుంటూ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. అయినప్పటికీ తన సంస్థను భారత్‌లో అడుగు పెట్టడం లేదని ఎలాన్‌ మస్క్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్‌ వేదికగా ముఖేష్‌ అంబానీని టార్గెట్‌ చేశారు. అయితే, ఈ ఐదేళ్ల ప్రయాణం, ఎదురైన అడ్డంకుల్ని పరిశీలిస్తే..  

2019-2020: భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే ప్రణాళికలపై స్పేస్‌ఎక్స్ దృష్టి సారించింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

2021: భారత్‌లో ‘స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో అనుబంధ సంస్థను రిజిస్టర్ చేశారు. అయితే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కనెక్షన్ల కోసం ముందస్తు బుకింగ్‌లు స్వీకరించడంతో టెలికాం శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో ప్రీ బుకింగ్‌లను నిలిపివేశారు.

2022-2023: భారత ప్రభుత్వ కొత్త శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా డేటా లోకలైజేషన్ (సమాచారం దేశంలోనే భద్రపరచడం) సెక్యూరిటీ క్లియరెన్స్‌లపై చర్చలు జరిగాయి. విదేశీ పెట్టుబడులు, భద్రతా నిబంధనల కారణంగా లైసెన్స్ ప్రక్రియ ఆలస్యమైంది.

2024: స్పేస్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేయడంతో, స్పెక్ట్రమ్ కేటాయింపు, లైసెన్సింగ్ ప్రక్రియ కోసం స్టార్‌లింక్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.

2025: టెలికాం శాఖ నుంచి అధికారికంగా జీఎంపీసీఎస్‌ లైసెన్స్, అలాగే అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్‌ స్పేస్‌  నుంచి తుది ఆమోదం లభించింది. డిసెంబర్ నాటికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.

2026: భారత్‌లో లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 గేట్‌వే సైట్లను స్టార్‌లింక్ నిర్మించింది. డేటా సెక్యూరిటీ నిబంధనలను పూర్తి చేసి, ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన తుది ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు 
ఈ క్రమంలో భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ ఆలస్యం కావడంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తమ సంస్థ సేవలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొద్దిమంది బిలియనీర్లు, వ్యాపార దిగ్గజాలు మార్కెట్‌పై తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం స్టార్‌లింక్‌ను నిరోధిస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందకుండా అడ్డుకోవడం భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరం అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.

మస్క్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం (టెలికాం మంత్రిత్వ శాఖ) తీవ్రంగా ఖండించింది. స్టార్‌లింక్‌తో పాటు జియో, వన్‌వెబ్ వంటి అన్ని కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు సంబంధించిన ప్రక్రియ అందరికీ ఒకే విధంగా నిష్పక్షపాతంగా జరుగుతోందని తేల్చిచెప్పింది. మస్క్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement