satilite stations
-
పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య
శ్రీహరికోట: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. పీఎస్ఎల్వీ-సీ61 మూడో దశలో సమస్య తలెత్తినట్టు ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ61ను ఆదివారం తెల్లవారుజామున చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఈ ప్రయోగంలో భాగంగా రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లిన కొంతసమయంలోనే సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ స్పందిస్తూ.. పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు చెప్పారు. ఈ మిషన్ అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు. సమస్యపై విశ్లేషించి వివరాలను వెల్లడిస్తామన్నారు. #WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO Chief V Narayanan says, "Today we attempted a launch of PSLV-C61 vehicle. The vehicle is a 4-stage vehicle. The first two stages performed as expected. During the 3rd stage, we are seeing observation...The mission could not be… pic.twitter.com/By7LZ8g0IZ— ANI (@ANI) May 18, 2025ఇక, ప్రయోగంలో అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-09)ను పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది.ఈ ఉపగ్రహం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని స్పష్టంగా హైరిజల్యూషన్‌తో చిత్రీకరణ చేయగలదు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పని చేయనుంది. దీని బరువు 1710 కిలోలు. EOS-09 నింగిలో నిఘానేత్రంగా పనిచేయనుంది. దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో అమర్చారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh. EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0— ANI (@ANI) May 18, 2025 -
ఉపగ్రహాల్లో అక్కడికక్కడే విద్యుదుత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: ఉపగ్రహాలతో శాటిలైట్ టీవీలు మొదలుకొని ఖనిజాల గుర్తింపు వరకూ అనేక ప్రయోజనాలున్నాయి. అయితే భూమికి దూరంగా కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు పని చేయాలంటే విద్యుత్తు కావాలి. ఇప్పటివరకూ బరువైన సోలార్ ప్యానెల్స్ లేదా బ్యాటరీలతో ఈ విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఇలా కాకుండా... రేడియో ధార్మిక పదార్థాలు వెలువరించే వేడినే విద్యుత్తుగా మార్చగలిగతే? ఎన్నో ప్రయోజనాలుంటాయి. హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ హైలెనర్ టెక్నాలజీస్ అచ్చంగా ఇదే పనిలో ఉందిప్పుడు. ఈ దిశగా టేక్‌మీ2స్పేస్ అనే కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.వేడిని విద్యుత్తుగా మార్చేందుకు ఇప్పటికే థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ.. వీటితో అధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కష్ట సాధ్యం. మరోవైపు హైలెనర్ టెక్నాలజీస్ సంస్థ ప్రపంచంలో మొదటిసారి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా కాలుష్యం ఏమాత్రం లేని విద్యుత్తును ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. టేక్‌మీ2 స్పేస్ భూ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు కంపెనీలిప్పుడు చేతులు కలిపాయి. ఉపగ్రహాలకు విద్యుత్తును అందించేందుకు హైలెనర్ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థలను పరీక్షించేందుకు నిర్ణయించాయి. వేడిని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడం.. ఉపగ్రహాల్లోని కంప్యూటర్లను నడిపించడం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.‘‘లెనర్ టెక్నాలజీ అంతరిక్షంలోనూ పనిచేస్తుందని నిరూపించడం చాలా కీలకం. టేక్‌మీ2స్పేస్ నైపుణ్యం, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో ఈ విషయాన్ని నిరూపించేందుకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని హైలెనర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే.. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లోనూ అక్కడక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఏర్పడుతుంది. అది కూడా వృథా అవుతున్న వేడి సాయంతో!!ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!‘‘ఉపగ్రహాల్లో వేడిని తగ్గించడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. హైలెనర్ టెక్నాలజీస్ ఉత్పత్తులు ఈ ఘనత సాధిస్తే అతితక్కువ స్థలంలో దీర్ఘకాలం పనిచేయగల ఒక ఇంధన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’’ అని టేక్‌మీ2 స్పేస్ వ్యవస్థాపకుడు రోనక్ కుమార్ సామంత్రాయ్ తెలిపారు. సౌర విద్యుత్తు, బరువైన బ్యాటరీల వాడకాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వివరించారు. -
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 10న ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈ నెల 9న లాంచ్ రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు వారికి అప్పగిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–01, ఆజాదీశాట్–02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్, మొబైల్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా. The long snake-like filament cartwheeled its way off the #Sun in a stunning ballet. The magnetic orientation of this Earth-directed #solarstorm is going to tough to predict. G2-level (possibly G3) conditions may occur if the magnetic field of this storm is oriented southward! pic.twitter.com/SNAZGMmqzi — Dr. Tamitha Skov (@TamithaSkov) July 16, 2022 శక్తివంతమైనదే! జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్ల నుంచి వెలువడే రేడియేషన్ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. ఎఫెక్ట్.. గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా. -
ఉక్రెయిన్‌లో యుద్ధం, అండగా నిలుస్తున్న ఎలన్ మస్క్..ఎలా అంటే?
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ట్వీట్‌కు ఎలన్ మస్క్ స్పందించారు. మీరు మార్స్‌పై రాకెట్లతో ప్రయోగాలు చేస్తున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది! మీ రాకెట్లు స్పేస్‌లో విజయవంతంగా ల్యాండ్ అవుతున్నప్పుడు రష్యా రాకెట్లు ఉక్రేనియన్ పౌరులపై దాడి చేస్తాయి! ఈ సమయంలో రష్యా సేనల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్ధ్యం ఉన్న స్టార్‌లింక్ స్టేషన్లను యాక్టీవ్ చేయాలని ట్వీట్ చేశారు. అంటే స్టార్‌లింక్ స్టేషన్ల సాయంతో రష్యా కు చెక్ పెట్టే సామర్ధ్యం ఉక్రెయిన్లలో ఉందని అర్ధం వచ్చేలా ట్వీట్ లో పేర్కొన్నారు. అలా ఫెడోరోవ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎలన్ మస్క్ ఆ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. ఉక్రెయిన్ లో స్టార్‌లింక్ సర్వీసులు యాక్టీవ్‌గా ఉన్నాయని ఎలన్ రిప్లయిలో తెలిపారు. అంతేకాదు మరిన్ని టెర్మినల్స్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి ఉంటాయని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ కీలకం రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ కీలకంగా మారింది. రష్యా సైనికులు వరుస బాంబు దాడులతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కమ్యునికేషన్ వ్యవస్థ నిలిచిపోవడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రజలు శాటిలైట్ ఇంటర్నెట్ పై ఆధారపడింది. మరోవైపు దాడులతో రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో తమ ప్రాణాల్ని నిలుపుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బంకర్లలో తలదాచుకుంటూనే రష్యా సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు. యుద్ధంలో తగిలిన గాయాలతో రక్తం ఒడుతున్నా తమ దేశాన్ని పరాయి దేశ పాలకుల చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని సవాలు విసురుతున్నారు. -
భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్లు భూమి మీద జరిగే వ్యాపారాల్లోనే కాదు, అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లోనూ నువ్వా నేనా అంటూ ఒకరికొకరు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్ట్‌ను ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ విఫలమయ్యారు. తాజాగా స్పేస్‌లో ఆదిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో మస్క్ అందరికంటే ముందంజలో ఉండగా.. జెఫ్‌బెజోస్ సైతం 'ప్రాజెక్ట్ కైపర్' పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు. ఇందుకోసం ఉపగ్రాహాలను స్పేస్‌లోకి పంపేందుకు అమెరికా ప్రభుత్వం నుంచి వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. జెఫ్‌బెజోస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే 4,500 కంటే ఎక్కువ ఉపగ్రహాలను (శాటిలైట్స్) స్పేస్‌లోకి పంపేందుకు యూఎస్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందారు. తాజాగా గత వారం మరో 7,774 ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపేందుకు, నవంబర్ 7న (నిన్న ఆదివారం) అమెజాన్ 2022 చివరి నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎఫ్‌సీసీని అనుమతి కోరారు. ఈ అనుమతులతో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని వినియోగదారులందరికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించవచ్చని ఎఫ్‌సీసీ అనుమతి కోసం పంపిన నివేదికలో జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడినప్పటికీ ప్రపంచ జనాభాలో 51%, అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో 44% మాత్రమే ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్పేస్ ఎక్స్ ముందంజ స్పేస్ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రాజెక్ట్ లో భాగంగా 2027 నాటికల్లా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,800కుపైగా శాటిలైట్లను పంపారు. వాటి సాయంతో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌లోని 14 దేశాల్లో వంద డాలర్ల ప్రీ-ఆర్డర్ బుకింగ్(రిఫండబుల్) శాటిలైట్ సేవల్ని అందిస్తున్నారు. ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ గనుక పని చేయకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. స్టార్లింక్స్తో పాటు ఎకోస్టార్, లియోశాట్, ఓ3బీ, టెలీస్టాట్, అప్స్టార్ట్ తో పాటు వర్జిన్ గెలాక్టిక్ ‘వన్‌వెబ్’ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చదవండి:శుభవార్త..! 'జియో'కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
ఐఫోన్ 13లో సరికొత్త ఆప్షన్.. ఆపదలో ఆదుకునేలా!
సరికొత్త ఫీచర్లతో టెక్ యూజర్లను ఆకట్టునేలా ఫోన్లను తీసుకువచ్చే యాపిల్ కంపెనీ ఈ సారి మరో కొత్త ఆప్షన్‌తో ముందుకు రానుంది. ఈ నెలాఖరుకల్లా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఐ ఫోన్ 13ని ఆపదలో ఆదుకునే పరికరంగా కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్ యాపిల్ సంస్థ నుంచి త్వరలో మార్కెట్‌కి రాబోతున్న ఐఫోన్ 13లో ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు చేసే సమయంలో నెట్వర్క్ పని చేయని సందర్భంలో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా ఈ ఫీచర్ పని చేస్తుందని బ్లూమ్‌బర్గ్ టెక్ నిపుణుడు మార్క్ గుర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్ మేసేజ్‌లు చేసే వీలున్నా ఇవన్నీ పరిమితంగానే పని చేస్తాయి. యాపిల్ అందించే ఎమర్జెన్సీ ఫీచర్లో తమ చుట్టు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఎస్ఎమ్మెస్లను పంపే వీలుంటుంది. దీని వల్ల ఎమర్జెన్సీ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మరింత మెరుగ్గా స్పందించే వీలు కలుగుతుంది. లియో ఆధారంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీగా చెబుతున్న లో ఎర్త్ ఆర్బిన్, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్ పని చేస్తుందని చెబుతున్నారు. మొబైల్ నెట్వర్క్ పని చేయని చోట తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్‌ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పరిమితంగా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. అక్కడ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్ పని చేస్తుంది. ప్రస్తుతం అనేక సంస్థలు లియో టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఇండియాలో టాటా , ఎయిర్టెల్ సంస్థలు లియో టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫీచర్ ఇప్పుడే కాదు ఐ ఫోన్ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్‌తో పని లేకుండానే కాల్స్, మేసేజ్ చేసుకోవచ్చనే వార్తలు మొదటగా వచ్చాయి. అయితే లియో టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు తయారు చేసేందుకు అవసరమైన హార్డ్‌వేర్ ఇంకా భారీ స్థాయిలో అందుబాటులోకి రాలేదు, పైగా అన్ని దేశాల్లోనూ లియో టెక్నాలజీ కమర్షియల్ స్థాయిని అందుకోలేదు. దీంతో లియో టెక్నాలజీని తెచ్చేందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యాపిల్ సొంతంగా టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్ సంస్థ లియో పైనా కన్నేసింది. అయితే ఇతర సంస్థలకు చెందిన శాటిలైట్లను ఉపయోగించుకోవడానికి బదులుగా తానే స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అందువల్లే ఐఫోన్ 13లో లియో టెక్నాలజీ వాడలేదని చెబుతున్నారను. కానీ యాపిల్ సంస్థ ఇంటర్నల్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం లియో ఆపరేషన్స్ సొంతంగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ -
శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్స్ ఫుల్
ఇంద్రకీలాద్రి : శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులన్నీ ఆదివారం కిటకిటలాడాయి. రికార్డు స్థాయిలో యాత్రికులు విజయవాడకు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. నగర శివారులో ఆర్టీసీ ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులలో యాత్రికులు స్నాన ఘాట్లకు చేరుకున్నారు. శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్ బస్సులు నిండిపోవడంతో యాత్రికులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించారు. ఫుట్‌బోర్డు ప్రయాణం వద్దని ఆర్టీసి సిబ్బంది వారించినా యాత్రికులు పట్టించుకోలేదు. మరో వైపు జక్కంపూడి వైవీ.రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ శాటిలైట్ స్టేషన్ ఆదివారం పుష్కర యాత్రికులతో నిండిపోయింది. మరో వైపున భవానీపురం స్నాన ఘాట్లు యాత్రికులతో నిండిపోవడంతో పుష్కర స్పెషల్ బస్సులను గొల్లపూడి వైపు మళ్లించారు. బస్సులను నైనవరం ఫ్లైవోవర్ మీద నుంచి కాకుండా జక్కంపూడి మీదగా గొల్లపూడి స్నాన ఘాట్లకు తరలించారు. అయితే పుష్కర యాత్రికులకు సరైన సమాచారం లేకపోవడంతో కొంత మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంకలో చంటి పిల్లలతో చేతిలో లగేజీలో ఎటు వెళ్లాలో తెలియన అనేక మంది యాత్రికులు తీవ్ర ఆగచాట్లకు గురయ్యారు. -
పుష్కర రైళ్లు సిద్ధమండి