పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య | PSLV C61 Satellite Launch In Sriharikota | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

May 18 2025 6:35 AM | Updated on May 18 2025 9:54 AM

PSLV C61 Satellite Launch In Sriharikota

శ్రీహరికోట: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61  ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.  పీఎస్‌ఎల్‌వీ-సీ61  మూడో దశలో సమస్య తలెత్తినట్టు ఇస్రో చైర్మన్‌ నారాయణ వెల్లడించారు. 

వివరాల ప్రకారం..  ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ61ను ఆదివారం తెల్లవారుజామున చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా  ఈ ప్రయోగంలో భాగంగా రాకెట్‌ ఆకాశంలోకి దూసుకెళ్లిన కొంతసమయంలోనే సాంకేతిక సమస్యలు వచ్చాయి.  ఈ క్రమంలో ఇస్రో చైర్మన్‌ స్పందిస్తూ..  పీఎస్‌ఎల్‌వీ-సీ61  ప్రయోగంలో మూడో​ దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు చెప్పారు. ఈ మిషన్‌ అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు. సమస్యపై విశ్లేషించి వివరాలను వెల్లడిస్తామన్నారు. 

ఇక, ప్రయోగంలో అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS-09)ను పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి తీసుకెళ్లింది.ఈ ఉపగ్రహం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని స్పష్టంగా హైరిజల్యూషన్‌తో చిత్రీకరణ చేయగలదు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పని చేయనుంది. దీని బరువు  1710 కిలోలు. EOS-09 నింగిలో నిఘానేత్రంగా పనిచేయనుంది.  దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో అమర్చారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement